
• గిరిజన తండాలకి చెందిన మైనర్ బాలికలపై అత్యాచారం చేస్తూ లైంగిక వేధింపులకు పాల్పడుతున్న నవోదయ నర్సింగ్ కళాశాల ప్రిన్సిపల్ రవీంద్రారెడ్డి పై స్టేషన్ బెయిల్ ఇచ్చే కేసు నమోదు చేయడంపై విజవాడ నగర పోలీస్ కమిషనర్ క్రాంతి రానా టాటా సమాధానం చెప్పాలి
• గిరిజన మైనర్ బాలికలపై కడప జిల్లాకు చెందిన రవీంద్రారెడ్డి అత్యాచారం చేస్తూ లైంగిక వేధింపులకు పాల్పడుతున్న మహిళా కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ ఎందుకు స్పందించారు?
• సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఎమ్మెల్సీ రుహుల్ల కార్యాలయాలకు కూత వేటు దూరంలోనే గిరిజన మైనర్ బాలికలపై లైంగిక వేధింపులు దాడులు జరుగుతుంటే స్పందించరేం? ఈ ఘటనపై ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు దేవినేని అవినాష్ లు ఎందుకు మౌనంగా ఉన్నారు.
• నవోదయ నర్సింగ్ కళాశాల ప్రిన్సిపల్ రవీంద్రారెడ్డిని కఠినంగా శిక్షించాలి.
• నవోదయ నర్సింగ్ కళాశాల గుర్తింపును తక్షణమే రద్దు చేయాలి. అక్కడ చదువుతున్న విద్యార్దినిల భవిష్యత్తును భద్రంగా కాపాడాల్సిన బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే తీసుకోవాలి.
• 100 మంది బాలికలు చదువుతున్న నర్సింగ్ కళాశాలలో సీసీటీవీలు ఎందుకు ఏర్పాటు చేయలేదు?
విజయవాడ, (జనస్వరం) : జనసేన పార్టీ విజయవాడ నగర అధ్యక్షులు రాష్ట్ర అధికార ప్రతినిధి మరియు పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జ్ పోతిన వెంకట మహేష్ పైపుల రోడ్డు, అంబాపురం వద్ద గల నవోదయ నర్సింగ్ కళాశాలను జనసేన పార్టీ నాయకులతో నర్సింగ్ కళాశాలలో చదువుతున్న విద్యార్థినీలను కలిసి వివరాలను అడిగి తెలుసుకుని వారికి అండగా నిలబడతామని ధైర్యం చెప్పి భరోసా కల్పించినారు. ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ గిరిజన తండాలకి చెందిన మైనర్ బాలికలపై అత్యాచారం చేస్తూ లైంగిక వేధింపులకు పాల్పడుతున్న నవోదయ నర్సింగ్ కళాశాల ప్రిన్సిపల్ రవీంద్రారెడ్డిపై స్టేషన్ బెయిల్ ఇచ్చే కేసు నమోదు చేయడంపై విజవాడ నగర పోలీస్ కమిషనర్ క్రాంతి రానా టాటా సమాధానం చెప్పాలని, రవీంద్రారెడ్డిపై మెతక వైఖరి అవలంబించటానికి కారణం ఏంటో అర్థం కావడం లేదని, గిరిజన మైనర్ బాలికలపై కడప జిల్లాకు చెందిన రవీంద్రారెడ్డి అత్యాచారం చేస్తూ లైంగిక వేధింపులకు పాల్పడుతున్న మహిళా కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ ఎందుకు స్పందించలేదని, రవీంద్రారెడ్డి చేస్తున్న లైంగిక వేధింపులు వాసిరెడ్డి పద్మకి ఏమన్నా సంసారం లాగా కనపడుతున్నాయా అని తక్షణమే ఈ ఘటనపై స్పందించాలని, సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఎమ్మెల్సీ రుహుల్ల కార్యాలయాలకు కూత వేటు దూరంలోనే గిరిజన మైనర్ బాలికలపై లైంగిక వేధింపులు దాడులు జరుగుతుంటే ఎందుకు స్పందించడం లేదని, ఈ ఘటనపై ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు దేవినేని అవినాష్ లు ఎందుకు మౌనంగా ఉన్నారని, నవోదయ నర్సింగ్ కళాశాల ప్రిన్సిపల్ రవీంద్రారెడ్డిని కఠినంగా శిక్షించాలని, నవోదయ నర్సింగ్ కళాశాల గుర్తింపును తక్షణమే రద్దు చేయాలని, అక్కడ చదువుతున్న విద్యార్దినిల భవిష్యత్తును భద్రంగా కాపాడాల్సిన బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే తీసుకోవాలని, 100 మంది బాలికలు చదువుతున్న నర్సింగ్ కళాశాలలో సీసీటీవీలు ఏర్పాటు చేయపోవడం వెనక అనేక అనుమానాలు కలుగుతున్నాయని, భోజన వసతి అధ్వానంగా నాసిరకంగా ఉందని, గిరిజన తండాలకు చెందిన మైనర్ బాలికలపై లైంగిక దాడులకు పాల్పడుతూ ఎవరన్నా బయటికి చెబితే ఇంటర్నల్ మార్కులు వేయనని బ్లాక్మెయిలింగ్ చేస్తున్న రవీంద్ర రెడ్డిపై గతంలో ఈ కళాశాలలో చదువుకున్న విద్యార్థినిల వద్ద నుంచి కూడా సమాచారం సేకరించి కఠినంగా శిక్షించాలని జనసేనపార్టీ విజయవాడ తరపున డిమాండ్ చేస్తున్నామన్నారు. మహేష్ పాత ప్రభుత్వ ఆసుపత్రిలో రవీంద్రారెడ్డి చేతిలో లైంగిక దాడికి గురైన విద్యార్థిని కలిసి పరామర్శించి ధైర్యం చెప్పినారు. ఈ కార్యక్రమంలో విజయవాడ నగర్ ఉపాధ్యక్షులు కామల్ల సోమనాదం, నగర సహాయ కార్యదర్శి పాల రజిని, కొరగంజి వెంకటరమణ సోడిశెట్టి రాధాకృష్ణ, డివిజన్ అధ్యక్షులు కుప్పాల శ్రీనివాస్, పైలా ప్రకాష్, జిగడం శ్రీనివాస్, తాడి దుర్గారావు, నరేంద్ర, ఉమామహేశ్వరరావు పొట్నూరి శ్రీనివాసరావు, పైలా పవన్ చలమలశెట్టి శ్రీను, యర్రా. నరేష్, ఆదిత్య రెడ్డి తదితరులు పాల్గొన్నారు.