నెల్లూరు ( జనస్వరం ) : అఖిలపక్షాలతో కలిసి కలెక్టర్ గారికి కావలి గ్రావెల్ అక్రమ రవాణా విషయమై జనసేన పార్టీ నాయకులు కలెక్టర్ గారికి ఫిర్యాదు చేశారు. వారు మాట్లాడుతూ గత మూడు నెలలుగా కోవురు నియోజకవర్గంలో ఇసుక అక్రమ గ్రావెల్ రవాణా గురించి పదేపదే విజిట్ చేసి కలెక్టర్ గారు దృష్టికి తీసుకువచ్చి కొంతవరకు గ్రావెల్ కట్టడి చేయగలిగాం. కానీ ఇసుక మాత్రం నిరంతరంగా అక్రమ రవాణా సాగుతూనే ఉంది రాత్రి 10 గంటల పైన తెల్లవారుజామున 5:00 లోపల వందల సంఖ్యలో లారీలు తరలిపోతున్నాయి. అధికారులు సరిగ్గా కట్టడి చేస్తే ఈ చర్యలు పునరావృతం కాకుండా పోయే అవకాశం ఉంది. మాతో వచ్చిన కార్యకర్తలను బెదిరించడం ఇంటిపై దాడికి పంపుతామంటూ సూచనలు ఇవ్వడం సరైన పద్ధతి కాదు. మూడు నెలల లోపల మమ్మల్ని కూర్చోబెడతానని ఎవరో పెద్దమనిషి అన్నారట ఇంకా టైం తగ్గించుకోండి… జిల్లాలోని పది నియోజకవర్గాల్లో ఇసుక అక్రమ రవాణాల్లో మా జనసైనికులు అడ్డుకుంటారు ప్రభుత్వ స్థలాలు కేంద్రంగా వేల కోట్ల రూపాయలు సంపాదించింది చాలు. ఇకనైనా వీటిని వదిలేయాల్సిన పరిస్థితి ఉంది కావలి నియోజక వర్గం లో అఖిలి పక్షాలతో కలిసి జనసేన పార్టీ వారు గ్రావెల్ అక్రమ రవాణాపై చర్యలు తీసుకోవాలని పదేపదే చెప్పడంతో కొన్ని వాహనాలను సైతం సీజ్ చేశారు. కానీ వాటిని గవర్నమెంట్ హ్యాండోవర్ చేసుకొని సరైన చర్యలు తీసుకొని కట్టడి చేయడం లేదన్నారు. దీని నిమిత్తం ఈ రోజు కలెక్టర్ గారిని కలవడం జరిగింది రానున్న రోజుల్లో జిల్లాలోని ప్రతి నియోజకవర్గాల్లో వైసీపీ నాయకుల పెత్తందారులు చేస్తున్న అక్రమాలను అరికట్టి ప్రజాస్వామ్య దోపిడీని నిలవరింప చేస్తాము. నిన్నటి రోజున తెలుగుదేశం పార్టీ నాయకుల పై దాడి జరగడం హేయమైన చర్య, స్నేహపూరితమైన వాతావరణం గల నెల్లూరు జిల్లాలో ఇలా విష సంస్కృతి పెరగడం సరైన పద్ధతి కాదు. వీటిపై జిల్లా అధికారులు తగు చర్యలు తీసుకొని నియంత్రించవలసి ఉంది. ప్రజలందరూ కూడా ఈ దాడులను, ఆక్రమార్జనలను ఆరికట్టి,రానున్న రోజుల్లో ప్రజా ప్రభుత్వం జనసేన ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారికి అవకాశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్, కార్య దర్శి ప్రశాంత్ గౌడ్, కావలి పట్టణ అధ్యక్షుడు పొబ్బా సాయి, కావలి అధికార ప్రతినిధి ఋషి, తదితర జనసేన నాయకులు మరియు అఖిలపక్ష నేతలు పాల్గొన్నారు.