గంగాధర నెల్లూరు ( జనస్వరం ) : వెదురు కుప్పం మండల కేంద్రంలో జనసేన ఇంచార్జి Dr యుగంధర్ పొన్న ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్బంగా Dr యుగంధర్ పొన్న మాట్లాడుతూ నకిలీ ఎఫ్ ఐ ఆర్ తో ఏం చేద్దాం అనుకుంటున్నారు? సమాజానికి ఏం సందేశం ఇవ్వాలను కుంటున్నారు? ఈ ఎఫ్ ఐ ఆర్ వల్ల బాధిత కుటుంబానికి ఏమైనా మేలు జరిగిందా? నకిలీ ఎఫ్ ఐ ఆర్ తో ఏమి సాధించాలి అనుకుంటున్నారు? ఎఫ్ ఐ ఆర్ వెనుక ఉన్న ఉపముఖ్యమంత్రి ఉద్దేశం ఏమిటి? నియోజకవర్గ ప్రజలకు ఉప ముఖ్యమంత్రి సందేశం ఏమిటి? అంటూ ధ్వజమెత్తారు. ఆరంభము నుండి అరాచకత్వ ధోరణితోనే సామాన్య ప్రజలపై కేసులు పెడుతున్నారు, పత్రిక ప్రతినిధులపై కేసులు పెడుతున్నారు, ప్రతిపక్ష పార్టీలపై కేసులు పెడుతున్నారు, ఇన్ని చేసినా కూడా నియోజకవర్గం ఏమైనా అభివృద్ధి చెందిందా? వెదురుకుప్పం మండలంలో డిగ్రీ కళాశాల నిర్మించారా? ఐటీఐ భవనం పూర్తి చేయించారా? ఫైర్ ఇంజిన్ స్టేషన్ నిర్మాణం పూర్తి అయిందా?పచ్చికాపల్లం లో వారపు సంత నిర్మాణం జరిగిందా? మొరవలో వారపు సంత నిర్మించారా? దేవళం పేటలో వరపు సంత నిర్మించారా? పచ్చికాపల్లం నుండి దేవలంపేట మీదుగా కొత్తపల్లి మెట్ట వరకు డబల్ రోడ్డు వేసారా? వెదురు కుప్పం మండలంలోని 25 గ్రామపంచాయతీలోని గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించారా? అంటూ ధ్వజమెత్తారు. ఏ దేవునికి ప్రీతి ఈ కేసులు? ఎవరిని ఉద్ధరించడానికి ఈ కేసులు? నీ కూతురు ఎమ్మెల్యే చేయటానికి కేసులు పెడుతున్నారా? జనసేన అంటే భయమా? అని ప్రశ్నల మీద ప్రశ్నలు వేసి, ఉప ముఖ్యమంత్రి మీద నిప్పులు చేరిగారు.ఇది ముమ్మాటికి నిరంకుషత్వమే అని,ఇది ముమ్మాటికీ అరాచకత్వమే అని, అందుకే ఉప ముఖ్యమంత్రి కి సవాల్ విసురుతున్నా, నా బంధువులు అవినీతి చేశారు అని తెలిసిన వెంటనే వారిని దూరం పెట్టాను అని చెప్పే ఉపముఖ్యమంత్రి నారాయణ స్వామి తన బంధువులు ఎవరో, వాళ్ల పేరిట క్రిమినల్ కేసు నమోదు చేయాలన్నారు. ఎందుకు వారి మీద కేసు నమోదు చేయటం లేదు? బంధుప్రీతా?? లేదా మీ అవినీతిని బట్ట బయలు చేస్తారని భయమా? దమ్ముంటే ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి తన బంధువుల పై కేసు నమోదు చేయాలని తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు. ఒకవేళ వారిమీద కేసులు నమోదు చేస్తే, అప్పుడు ఉప ముఖ్యమంత్రి నిజాయితీపరులు అవుతారని తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పత్రికా ప్రతినిధులపై నమోదు చేసిన కేసును ఉపసంహ రించుకోవాలని, నకిలీ ఎఫ్ ఐ ఆర్ సృష్టించిన ఎస్ఐ, సీఐలను తక్షణమే సస్పెండ్ చేయాలి.ఎంక్వయిరీ తరువాత వారిని విధులనుండి డిస్మిస్ చేయాలని, జనసేన పార్టీ గంగాధర నెల్లూరు నియోజకవర్గం తరఫున డిమాండ్ చేస్తున్నానని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో వెదురు కుప్పం మండలం అధ్యక్షులు పురుషోత్తం, మండల బూత్ కన్వీనర్ యతీశ్వర్ రెడ్డి, జిల్లా సంయుక్త కార్యదర్శులు వెంకటేష్, రాఘవ, జిల్లా కార్యక్రమ కమిటీ సభ్యులు భానుచంద్రారెడ్డి, మండల యువజన అధ్యక్షులు సతీష్, మండల ప్రధాన కార్యదర్శి ముని, మధు, కార్వేటి నగర్ మండల అధ్యక్షులు శోభన్ బాబు, నియోజకవర్గ యువజన ప్రధాన కార్యదర్శి వెంకటేష్, కార్వేటి నగర్ మండల ఉపాధ్యక్షులు విజయ్, కార్వేటి నగరం మండల బూత్ కన్వీనర్ అన్నామలై, కార్వేటి నగర్ మండల ప్రధాన కార్యదర్శి సోము, హరీష్, కార్వేటి నగరం టౌన్ కమిటీ కార్యదర్శి మీనా, గంగాధర్ నెల్లూరు మండలం ఉపాధ్యక్షులు వెంకటాద్రి, పాలసముద్రం మండల అధ్యక్షుడు లతీష్ కుమార్, కార్వేటి నగరం మండలం కార్యదర్శి నవీన్ పాల్గొన్నారు.