విజయవాడ ( జనస్వరం ) : జనసేన పార్టీ పశ్చిమ నియోజకవర్గం ఇంచార్జ్ నగర అధ్యక్షులు మరియు రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్ పత్రికా ప్రకటన ద్వారా విజయవాడ మున్సిపల్ కమిషనర్ కి.. అధికార పార్టీ విజయవాడ నగర మేయర్ కి. మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బందికి తెలియజేస్తున్నాను. చట్టం ఎవరికి చుట్టం కాదు.. కాలం ఎప్పుడూ ఒకలా ఉండదు. ప్రతి ఒక్కరూ దీన్ని గమనించి నడుచుకోవాలని మహేష్ అన్నారు.. అధికార వైఎస్ఆర్సిపి పార్టీ ఏర్పాటు చేసిన బ్యానర్లు ఉంచుతూ కావాలనే జనసేన పార్టీ నాయకులు వేసినటువంటి బ్యానర్లు కేవలం రెండు గంటల వ్యవధిలోనే అధికారులు తొలగించడం దుర్మార్గమైన చర్య ..రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కావాలనే ప్రజల మధ్య ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టాలనే ఉద్దేశంతోనే ఇష్టానుసారం బ్యానర్లు వేస్తున్నారు. దమ్ముంటే వైయస్సార్సీపి బ్యానర్లు పక్కనే జనసేన బ్యానర్లు ఉంచండి .మా బ్యానర్లు తొలగించే సమయంలో మమ్మల్ని పిలవండి అప్పుడు ఏం జరుగుతుందో చూడండి. పదేపదే మేము ఏర్పాటు చేసిన బ్యానర్లను తొలగిస్తే ఈసారి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాము. విజయవాడ మున్సిపల్ కమిషనర్ కి ఒకటే విన్నవించుకుంటున్నాo విజయవాడ నగరంలో వైసీపీ పార్టీ నాయకులు ఏర్పాటు చేసిన బ్యానర్లు తొలగించాలి. ఎటువంటి సంఘటనలు జరిగిన దానికి మీరే బాధ్యత వహించాలి.. మా సహనాన్ని ఓర్పుని పరీక్షించాలని చూస్తే ఊరికినేది లేదు. మీరు మా బ్యానర్లు తొలగిస్తే మళ్లీ మళ్లీ ఏర్పాటు చేస్తాం.. రాష్ట్ర ప్రజలకు మీరు చేసిన అక్రమాలను తెలుసుకునే విధంగా ప్రజలకు అవగాహన తెలుపుతామన్నారు.