సర్వేపల్లిలో బొబ్బేపల్లి సురేష్ ఆధ్వర్యంలో జనం కోసం జనసేన

సర్వేపల్లి

      సర్వేపల్లి ( జనస్వరం ) : నియోజకవర్గంలోని ముత్తుకూరు మండలం పంటపాలెం పంచాయతీ వుట్ల బలిజ పాలెం నందు అదివారం జనం కోసం జనసేన 18వ రోజు కార్యక్రమాన్ని సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు బొబ్బేపల్లి సురేష్ నాయుడు నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి వెళ్లి వైసీపీ ప్రభుత్వ నిరంకుశ పాలన, అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను వివరిస్తూ జనసేన పార్టీ సిద్ధాంతాలను తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా బొబ్బేపల్లి సురేష్ నాయుడు మాట్లాడుతూ సర్వేపల్లి నియోజకవర్గంలోని పంటపాలెం గ్రామపంచాయతీ పరిధిలో 50 కుటుంబాలు పైబడి నివాసం ఉంటున్న ఊట్ల బలిజిపాలెం ఇక్కడ పేద కుటుంబీకులే నివాసం ఉంటున్నారు. అయితే ఈ చుట్టుపక్కల ఆయిల్ కంపెనీలు నడుస్తున్నాయి, ఈ ఆయిల్ కంపెనీల నుంచి వచ్చేటువంటి దుర్వాసన కావచ్చు, అదేవిధంగా కంపెనీల నుంచి వచ్చే వ్యర్ధాలను భూగర్భంలోకి వదిలే యడంతో చుట్టుపక్కల బోర్లలో వచ్చే నీళ్లు అద్వానంగా ఉండడంతో ఇక్కడ గ్రామస్తులు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. అయితే ఈ ఆయిల్ కంపెనీల నుంచి ప్రతి సంవత్సరం కూడా ఈ చుట్టుపక్కల గ్రామస్తులకు ప్యాకేజీ అమౌంట్ ఇస్తామని చెప్పడం జరిగింది. అందులో భాగంగా ఎన్నికలకు ముందు మాత్రం నాయకులు వాగ్దానాలు చేస్తున్నారు కానీ పూర్తిస్థాయిలో ఈ గ్రామస్తులకు ప్యాకేజ్ అమౌంటు అందడం లేదు. కొంతమందికి మాత్రం ఇస్తున్నారు. మిగిలిన వారికి మాత్రమే ఎందుకు ఇవ్వడం లేదు అని చెప్పి మేము జనసేన పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా కొంతమందికి పెన్షన్ రావడం లేదు. కొంతమందికి పూర్తిగా ఇల్లు ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. జనసేన పార్టీ నుంచి ఒకటే డిమాండ్ చేస్తున్నాం మీరు ప్రతి 50 కుటుంబాలకి ఒక వాలంటరీ వ్యవస్థని పెట్టారు. మరి ఎందుకని పూర్తిగా పూర్తిస్థాయిలో ఈ గ్రామస్తులకి న్యాయం జరగలేదు. ఇకనైనా సరే కళ్ళు తెరిచి మిగిలిన వారికి ప్యాకేజీ అమౌంటు ఇస్తారా.. లేదంటే వాళ్లకు అండగా నిలబడి జనసేన పార్టీ పోరాటం చేయడానికి సిద్దమే. అదే విధంగా 2024లో జనసేన పార్టీ అధికారంలోకి వస్తుంది. మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతారు. సర్వేపల్లి నియోజకవర్గంలో ఉన్న సమస్యలు అన్నిటిని జనసేన పార్టీ పరిష్కరిస్తుంది అని చెప్పి మీడియా పూర్వకంగా తెలియజేస్తున్నానని సురేష్ నాయుడు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ముత్తుకూరు మండల యువజన నాయకుడు రహమాన్, వెంకటాచలం మండల నాయకుడు శ్రీహరి, రాజా తదితర జనసైనికులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way