నర్సింగ్ కాలేజీలో ఆత్మహత్యకు గురైన వర్షిని కుటుంబాన్ని పరామర్శించిన పూల శివప్రసాద్

పూల శివప్రసాద్

    పుట్టపర్తి ( జనస్వరం ) : కొత్తచెరువు మండలం బైరాపురం గ్రామానికి చెందిన నర్సింగ్ విద్యార్థిని అనంతపురం ప్రభుత్వ నర్సింగ్ కాలేజీలో చదువుతోంది.  జనసేన పార్టీ మండల అధ్యక్షుడు పూల శివప్రసాద్ వారి తల్లిదండ్రులని పరామర్శించి ఏమైంది అని అడగగా వర్షిని వేసవి సెలవులు ముగించుకొని కాలేజీకి తన చిన్నాన్న కొడుకు తీసుకువెళ్లగా అది చూసిన అక్కడ పనిచేసే అనురాధ వర్షినిని తన సోదరునితో అక్రమ సంబంధం అంటగట్టే విధంగా చాలా నీచంగా మాట్లాడి ఆ విద్యార్థిని మానసికంగా కృంగదీసింది ఈ కారణంగా భావోద్వేగానికి గురైన వర్షిని తోటి విద్యార్థులు కాలేజీకి వెళ్లగానే అక్కడ రూమ్ లో ఉరేసుకున్నది అని వారి తల్లిదండ్రులు తెలియపరిచారు. వర్షినికి ఫిబ్రవరిలో పోస్టల్ డిపార్ట్మెంట్లో ప్రభుత్వ ఉద్యోగం రాగా ఉద్యోగంలో చేరడానికి టిసి కావాలని అడిగితే ఇది ఒక ఉద్యోగమేనా అంటూ హేళన చేసి టీసీ ఇవ్వలేదని తెలిసింది. మధ్యాహ్నం రెండు గంటలకి వర్షిని చనిపోయిందని తెలిస్తే మూడు గంటల తర్వాత వారి తల్లిదండ్రులకు తెలియపరిచారు. కాలేజీ యాజమాన్యం గంట సేపు ఏం చేసింది..? స్థానిక పోలీసు వారు వర్షిని తల్లిదండ్రులు రాగానే వారి స్టేట్మెంట్ ప్రకారం కంప్లైంట్ తీసుకుంటామన్న పోలీసులు వారి కంప్లైంట్ ఎందుకు తీసుకోలేదు.? తనకు వచ్చింది ఎవరు అని విచారించకుండా, వారి తల్లిదండ్రులకు చెప్పకుండా వర్షిని సోదరినితో అక్రమ సంబంధం గా పోల్చి దుర్భాషలాడి మంచి భవిష్యత్తు ఉన్న వర్షిని ప్రాణాలు తీసుకున్న ఈ కాలేజీ యాజమాన్యం పైన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాము అని పూల శివప్రసాద్ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way