అనంతపురం ( జనస్వరం ) : హిందూపురం నియోజకవర్గంలో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ని మరియు ప్రతిపక్ష నాయకుల్ని కించపరుస్తూ బహిరంగ ప్రదేశాల్లో బ్యానర్లు వెలిశాయి. ఈ నీచ, దుర్మార్గ చర్యను ఖండిస్తూ హిందూపురం నియోజకవర్గం జనసేన ఇన్చార్జి ఆకుల ఉమేష్ మరియు కొంతమంది జనసేన నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి, బహిరంగ ప్రదేశాలలో ఇటువంటి నికృష్టమైన బ్యానర్లను తొలగించాలని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. కొంతమంది వైసిపి నాయకులు హిందూపురం పోలీసు వారి పైన ఒత్తిడి తెచ్చి రాత్రంతా హిందూపురం జనసేన నాయకులను, కార్యకర్తలను అక్రమంగా నిర్బంధించి, క్రిమినల్ కేసు నమోదు చేయడం జరిగింది. ఈ దుర్మార్గమైన చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాం వ్యతిరేకిస్తున్నాం. బహిరంగ ప్రదేశాల్లో ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తల మనోభావాలు దెబ్బతినేలాగా, రెచ్చగొట్టే విధంగా నీచ, నికృష్టమైన బ్యానర్లు ప్రదర్శించి సమాజానికి ఏం సందేశమిద్దాం అనుకుంటున్నారు? ప్రజలకు వివరించాలని జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. కేవలం వైసిపి నాయకులకు కార్యకర్తలకు మాత్రమే మనోభావాలు ఉంటాయా? ఇతర పార్టీల నాయకులకు కార్యకర్తలకు మనోభావాలు ఉండవా? ఇతర పక్షాలను రెచ్చగొట్టి సమాజంలో ఉద్రిక్తతలు సృష్టించి డైవర్ట్ పాలిటిక్స్ లో భాగంగా పబ్బం గడుపుకుందామంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరిస్తున్నాం. ప్రజలను చైతన్య వంతులను చేసి వచ్చే ఎన్నికల్లో వైసిపి పార్టీకి తగిన బుద్ధి చెబుతామని తెలియజేస్తున్నామని అనంతపురం జిల్లా జనసేన ఉపాధ్యక్షులు లాయర్ కుంటిమద్ది జయరాం రెడ్డి అన్నారు.