పత్తికొండ ( జనస్వరం ) : జర్నలిస్టు జేఏసీ ఆధ్వర్యంలో విలేకరులపై కడప ఎంపీ అవినాష్ రెడ్డి అనుచరులు దాడి చేయడాన్ని ఖండిస్తూ, స్థానిక డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సర్కిల్ నుండి నాలుగు స్తంభాల కూడలి వరకు ర్యాలీ, నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. అనంతరం జర్నలిస్ట్ జేఏసీ సభాధ్యక్షులు సాలరంగడు ఆధ్వర్యంలో నాలుగు స్తంభాల కూడలి దగ్గర జనసేన పార్టీ నియోజకవర్గ నాయకులు సిజి రాజశేఖర్ మాట్లాడుతూ మన రాష్ట్రంలో మీడియా మిత్రులకు భద్రత పూర్తిగా కరువయిందన్నారు. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య సారథిగా ఉండే మీడియా మిత్రులపై భౌతిక దాడులకు పాల్పడం చాలా సిగ్గుచేటు, అనడానికి ప్రత్యేక నిదర్శనమన్నారు. కర్నూల్ లో మీడియా ప్రతినిధులపై భౌతిక దాడులు చేయడం చాలా సిగ్గుచేటు, కడప ఎంపీ అవినాష్ రెడ్డి తల్లి కర్నూల్ లోనే విశ్వభారతి ఆసుపత్రిలో చేర్పించిన సంగతి తెలిసిందే, సోమవారం తను విచారణకు రాలేనంటూ సిపిఐకి అవినాష్ లేఖ రాయడంతో, సిబిఐ అధికారులు కర్నూలుకు వస్తున్నట్లు ప్రచారం జరగడంతో, స్థానిక మీడియా ప్రతినిధులు విశ్వ భారతి హాస్పిటల్ దగ్గర కవరేజ్ కోసం వెళ్లారు. మీడియా ప్రతినిధులను చూసిన అవినాష్ అనుచరులు 15 మంది రౌడీలు మీడియా మిత్రులపై ఎవరు నువ్వు, నీది ఏ పేపర్, ఏ ఛానల్ అని ప్రశ్నిస్తూ, బూతులు తిడుతూ విలేకరుల సుమారు పదిమంది లాక్కెళ్ళి విచక్షణారహితంగా కొట్టడం చాలా బాధాకరమైన విషయమన్నారు. ఎవరైతే మీడియా మిత్రులపై దాడికి పాల్పడ్డారు వారందరిపై కేసు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలని, జనసేన పత్తికొండ నియోజకవర్గం తరఫున కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.