• బాధిత రైతు పొలంలో మామిడి చెట్లు నాటి తీరుతాం
• మండలంలో పెట్టిన సూచిక బోర్డులు ఎక్కడ?
అన్నమయ్య జిల్లా, (జనస్వరం) : జనసేనపార్టీ తరపున బాధిత రైతు కుటుంబానికి అండగా ఉంటుందని రామ శ్రీనివాస్ ఆధ్వర్యంలో తలపెట్టిన కార్యక్రమం ద్వారా భరోసా ఇచ్చారు. అన్నమయ్య జిల్లా సుండుపల్లె మల్లక్కగారిపల్లిలో పొలంలో మామిడి చెట్లను నరికి వేయడం దౌర్భాగ్యమని భారత కమ్యూనిస్టు పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు బుక్కే విశ్వనాథ్ నాయక్, జనసేన పార్టీ నాయకులు, రాష్ట్ర కార్యదర్శి ముఖరం చాంద్, సీనియర్ నాయకులు రామ శ్రీనివాస్, యువ నాయకులు దినేష్ లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అధికార పార్టీ నాయకులకు రెవెన్యూ అధికారులు తొత్తులుగా మారడం తాతల కాలం నుండి ఉంటున్న భూములను ఐదు సంవత్సరాల మామిడి చెట్లను నరికివేయడం మండల ప్రజలు గమనిస్తున్నారని ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. గురువారం రైతు పొలంలో మామిడి చెట్లు నాటి తీరుతామన్నారు. సామాన్య రైతులకు ఒక న్యాయం బకాసురులకు ఒక న్యాయమా అని ప్రశ్నించారు. మండలంలో 110 ప్రభుత్వ సూచిక బోర్డులు పెట్టారు అవన్నీ ఈరోజేమైనట్టు అని ప్రశ్నించారు. గురువారం నాడు మామిడి చెట్లు నాటే కార్యక్రమానికి రెతులు వేలాది తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు ఓబులేసు, రాజా, సలీమ్, నాగార్జున, వెంకటేష్, జనసైనికులు, గ్రామస్థులు, ఎమ్మార్పీఎస్ నాయకులు మహాదేవ, ప్రజాసంఘాల నాయకులు, రైతులు, స్థానికులు పాల్గొన్నారు.