రాజమండ్రి రూరల్ ( జనస్వరం ) : జనచైతన్య శంఖారావం కార్యక్రమం ధవలేశ్వరం క్వారీ కెనాల్ ఏరియాలో 27వ రోజు ప్రారంభించడం జరిగింది. ప్రారంభం నుంచి ఈ ప్రాంతంలో జనసేన పార్టీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్ గారికి అపూర్వ స్వాగతం పలకడం జరిగింది. ఈ ప్రాంతంలో ముఖ్యంగా డ్రైనేజీ వ్యవస్థ అద్వానంగా ఉంది రోడ్లు అసలే లేవు నడవడానికి సరైన దారి లేక స్థానిక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒక్కొక్కసారి నడిచే దారిలోకి పాములు కూడా వచ్చేస్తున్నాయి. దోమలు విపరీతంగా పెరిగిపోయాయి. ముందు భాగంలో కల్వర్ట్ బ్లాక్ చేయడం వల్ల డ్రైనేజీ వాటర్ డ్రైనేజీలు నిండిపోయేలా వెనక్కి వచ్చేస్తున్నాయి. ఈ ప్రాంతంలో మేం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య రోడ్ల సమస్య మరియు డ్రైనేజీ వ్యవస్థ మేమున్న ప్రాంతం ఎగువ ప్రాంతం అయినా సరే మేము వాడిన వాటర్ బయటికి వెళ్లే దారి లేదు అని స్థానిక ప్రజలు వాపోడం జరిగింది. మమ్మల్ని పట్టించుకునే నాధులే లేరు మేము ఎన్నిసార్లు కంప్లైంట్ చేసిన కంప్లైంట్ కి ఎవరు రెస్పాండ్ కారు మేము చెప్పి చెప్పి విసిగి పోవడం జరిగిందని స్థానిక ప్రజలు చెప్పడం జరిగింది. దుర్గేష్ మాట్లాడుతూ నేను పంచాయతీ అధికారులతోటి మాట్లాడి తొందర్లోనే మీ సమస్య తీరుస్తానని, లేనిపక్షంలో ఆరు నెలల ఎలక్షన్లు వస్తాయని ఈ ఎలక్షన్లలో మీరు కచ్చితంగా జనసేన పార్టీనీ గెలిపించాలని ముందు ధవళేశ్వరంలో ఉన్న ప్రతి సమస్యను తీర్చడానికి ప్రయత్నిస్తానని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమం మట్టపర్తి నాగరాజు, దూది సాయి, ఆవాల శివ, పొట్టి శ్రీను, కుడిపూడి వెంకటేశ్వరరావు, శంకర్, కిరణ్, జిల్లా కార్యదర్శి బీర ప్రకాష్, కార్యదర్శి అమీనా, సూరాడ సత్తిబాబు, ఆటో బుచ్చి, జనసేన పార్టీ వేమగిరి గ్రామ కమిటీ ప్రెసిడెంట్ కొప్పిశేట్టి రాజేష్, జంగా వినోద్, లోకేష్ తదితరులు పాల్గొనడం జరిగింది.