ఖమ్మం ( జనస్వరం ) : అసెంబ్లీ నియోజకవర్గంలో పార్టీని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకుని వెళ్లే కార్యాచరణని చర్చించడానికి ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గ కో ఆర్డినేటర్ మిరియాల రామకృష్ణ గారి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఖమ్మం నగరంలోని ప్రతి డివిజన్ లో అదే విధంగా, రఘునాధపాలెం మండలంలోని ప్రతి గ్రామంలో కమిటీలు ఏర్పాటు చేయాలని, జెండా దిమ్మెలు నిర్మాణం చేయాలి అని నిర్ణయించడం జరిగింది. ప్రతి డివిజన్ లో స్థానిక నాయకత్వాన్ని ప్రోత్సహించి ప్రజా సమస్యలపై పోరాటం చేయాలని నిర్ణయించడం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర నాయకులు జగన్మోహన్ మిరియాల, ఖమ్మం జిల్లా నాయకులు బండారు రామకృష్ణ, హరిప్రియ, మేకల సైదులు, కొండా పవన్ ఖమ్మం నగర కమిటీ అధ్యక్షులు మెడబోయిన కార్తిక్, ఉపాధ్యక్షులు లయ దేవేందర్, షేక్ మాలిక్, ఆర్గనైజింగ్ సెక్రెటరీలు తుడం ఉత్తమ్ రాజు గుంత సత్యనారాయణ, బాణాల శ్రీకాంత్, సెక్రెటరీలు లింగాల పుల్లారావు, గుండ్ల పవన్ కళ్యాణ్, నగర కార్యవర్గ సభ్యులు శివరాత్రి రమణ కుమార్, దుర్గాప్రసాద్, గుండబోయిన నరేష్, ఉపేందర్, బుషి శ్రీనివాసరావు, విజయకుమారి, నరసింహారావు రఘునాదెపాలెం మండల నాయకులు స్రవంత్ కన్నా, విద్యార్థి విభాగం నాయకులు గంగాధర్, రాకేష్, విజయ్, రాము పాల్గొన్నారు.