పాడేరు ( జనస్వరం ) : పాడేరు మండలం బూరుగుపుట్టు గ్రామం బర్సింగి పంచాయతీలో జనసేనపార్టీ పాడేరు మండల అధ్యక్షులు నందోళి మురళీకృష్ణ పర్యటించారు. ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంకి రోడ్ల మీద ప్రజల ప్రాణాల మీద బాధ్యత లేని ప్రభుత్వాన్ని గద్దె దించే రోజులు దగ్గర పడ్డాయని అన్నారు. సీసీ రోడ్ సమస్య, ప్రభుత్వాలు మారినప్పటికీ ఈ గ్రామంలో సమస్య కోసం పట్టించుకొనే అధికారులు లేక పోవడం చాలా బాధాకరమని అన్నారు. జనసేన పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే గ్రామస్తులకు సీసీ రోడ్ నిర్మాణం పనులు పూర్తి అయ్యేలా చేస్తామని తెలిపారు. కనీసం ప్రజలు తాగే మంచినీటి సౌకర్యం లేక కలుషిత నీరు తాగడం వల్ల ప్రజలు అనారోగ్యాలకు గురవుతున్నారు. తక్షణమే వైసీపీ ప్రభుత్వం అధికారులు, తక్షణమే ఈ గ్రామంలో మంచి నీటి సదపాయం కల్పించవలసినదిగా డిమాండ్ చేశారు. అలాగే ప్రజలకు జనసేన పార్టీ సిద్ధాంతాలు మేనిఫెస్టో గ్రామస్తులకు తెలియజేశారు. జనసేన పార్టీ బలోపేతానికి గ్రామస్తులు అందరూ కంకణం కట్టుకొని జనసేన పార్టీ అధికారం వచ్చేలా కృషి చేయాలని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం చేసే తుగ్లక్ పరిపాలనను తరిమికొట్టి పవన్ కళ్యాణ్ కు ఒక్క అవకాశం ఇవ్వవలినదిగా కోరారు. వైసీపీ ఓటు బ్యాంకును ఛీల్చడమే ప్రధాన అజెండాగా పని చేసి జనసేన ప్రభుత్వం వచ్చేలా కృషి చేస్తామని అన్నారు. అలాగే ప్రతి గ్రామంలో పర్యటించిన జనసైనికులకు ప్రజలు ఆదరించడం చూసి ధన్యవాదాలు తెలిపారు. కష్టాల్లో ఉన్న ప్రజలకు జనసేన పార్టీ ఎప్పుడు అండగా ఉంటాదని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాడేరు జనసేన పార్టీ మండల అధ్యక్షులు నందొలి మురళికష్ణ, జనసేన మండల నాయకులు, అప్పలరాజు, సురేష్, గ్రామస్తులు, గంగధర్, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు