న్యూస్ ( జనస్వరం ) : మాతృ దినోత్సవాన్ని పురస్కరించుకుని కెనడా జనసేన టీమ్ ఆధ్వర్యంలో ఆదివారం కెనడా జనసేన జూమ్ సమావేశం జనసేన పార్టీ అధికార ప్రతినిధి కీర్తనతో నిర్వహించడం జరిగింది. కెనడా జనసేన టీమ్ మాతృ దినోత్సవ సందర్భంగా అమ్మ యొక్క గొప్పదనాన్ని స్మరించుకుంటూ సమావేశాన్ని ప్రారంభించడం జరిగింది. అనంతరం సమావేశానికి ముఖ్య అతిధులుగా పాల్గొన్న జనసేన పార్టీ అధికార ప్రతినిధి కీర్తన, యూకే నుండి జనసేన ఎన్నారై వీరమహిళ మరియు శతఘ్ని న్యూస్ డైరెక్టర్ పద్మజ రామిశెట్టి మరియు ఆస్ట్రేలియా నుండి జనసేన వీరమహిళ హేమానాయుడులను సమావేశానికి పరిచయం చేయడం జరిగింది. ఈ సందర్భంగా కీర్తన మాట్లాడుతూ జనసేన పార్టీ సిద్ధాంతాలను ప్రజలలోకి బలంగా తీసుకెళ్ళాలని తద్వారా పార్టీని బలోపేతం చేయాలని, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీసుకునే నిర్ణయాలను కార్యకర్తలు తూచ తప్పకుండా అనుసరించాలని కోరారు. ఆయన తీసుకునే ప్రతీ నిర్ణయం చాలా అలోచించి తీసుకుంటారని కనుక మనం ఆయన నిర్ణయాన్ని గౌరవించి ఆ నిర్ణయాన్ని బలపరిచి జనసేనానికి అండగా నిలవాలని అన్నారు. అనంతరం యూకే జనసేన ఎన్నారై వీరమహిళ మరియు శతఘ్ని న్యూస్ డైరెక్టర్ పద్మజ రామిశెట్టి మాట్లాడుతూ జనసేనలో మహిళలకి ఇచ్చే గౌరవాన్ని గురించి ఒకసారి గుర్తు చేసారు. జనసేనలో మహిళలను చాలా బాగా గౌరవిస్తారని ఆ సంప్రదాయాన్ని అధినేత పవన్ కళ్యాణ్ కార్యకర్తలకు అలవాటు చేసారని తెలిపారు. అనంతరం ఆస్ట్రేలియా జనసేన వీరమహిళ హేమానాయుడు మాట్లాడుతూ పార్టీని ఎలా అభివృద్ధి చేయాలి అని ఆస్ట్రేలియా టీమ్ ఎప్పటికపుడు సమావేశాలు నిర్వహిస్తుంటామని అన్నారు. ఈ సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం మరియు ప్రజా శ్రేయస్సు కొరకు ఆయన పడే తపనను చూసి ఆకర్షితురాలినై పార్టీ కోసం పనిచేస్తున్నానని తెలిపారు. అనంతరం కీర్తన మాట్లాడుతూ ఎన్నారైలు పార్టీకి చేస్తున్న సేవలు అభినందనీయమని, ఏ సమయంలో ఏ అవసరం వచ్చినా వెంటనే స్పందించి సహాయం చేస్తారని, ఈసారి ఖచ్చితంగా చిత్తూరులో జనసేన జెండా ఎగురేస్తామని అన్నారు. స్వచ్చత లేని మద్యం ద్వారా ప్రజల ఆరోగ్యం పాడవడడానికి కారణమవడం, యువతకు జాబులు క్రియేట్ చేయడంలో విఫలమవడం ఈ విధంగా వైసీపి వైఫల్యాలను ప్రజలలోకి తీసుకెళ్ళడం ద్వారా ప్రజలను ఎడ్యుకేట్ చేయాలని అన్నారు. ఈ సమావేశానికి సాయిప్రియ దాసం అధ్యక్షత వహించగా, స్వాగతోపన్యాసం కళ్యాణ్ గుర్రం చేశారు. ఈ సమావేశంలో కెనడా జనసేన నాయకులు, వీరమహిళలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.
సేకరణ – బాల విశ్వనాథ్ గుద్దేటి.