మదనపల్లి ( జనస్వరం ) : పొత్తులపై పవన్ కళ్యాణ్ మాట్లాడితే వైసిపి వాళ్ళుకు తడిచిపోతున్నాయని జనసేన పార్టీ రాయల దక్షిణ కోస్తా సంయుక్త పార్లమెంటరీ సమన్వయ కర్త మైఫోర్స్ మహేష్ ఎద్దేవా చేశారు. శనివారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వైసిపి ప్రభుత్వం తీరుపై విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా మైఫోర్స్ మహేష్ తనదైన శైలిలో వైసిపి ఎమ్మెల్యేలు, మంత్రులపై సెటైర్లు వేశారు. ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి పట్టిన వైసిపి అనే దారిద్ర్యాన్ని ఇంటికి పంపడానికి కల్యాణ్ కంకణం కట్టుకున్నారని అన్నారు. వైసిపి ప్రభుత్వాన్ని గద్దె దింపడమే లక్ష్యంగా పవన్ కళ్యాణ్ ముందుకు వెళ్తున్నారని అన్నారు. వైసిపి ప్రభుత్వాన్ని గద్దె నింపడానికి ఎవరితో పొత్తు పెట్టుకోవాలో తనకు తెలుసుకున్నారు. బిజెపి, టిడిపి, జనసేన పార్టీలు కలిసి పోటీ చేస్తాయనే విషయాన్ని స్పష్టంగా పవన్ కళ్యాణ్ ప్రకటించడంతో దిక్కు తోచని వైసిపి అదిష్టనం మంత్రులు, ఎమ్మెల్యేల చేత మాట్లడిస్తోందన్నారు. పొత్తులపై పవన్ కళ్యాణ్ మాట్లాడితే మంత్రులు రోజా, అమరనాథ్, అంబటి ఏదో మాట్లాడి సిఎం జగన్మోహన్ రెడ్డి మెప్పు కోసం ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. పవన్ కళ్యాణ్ పొత్తు అంటే వైసిపి వారికి తడిచిపోతున్నాయని దీంతో దిక్కుతోచక అవాకులు, చెవాకులు మాట్లడుతున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రాని పట్టిన దారిద్ర్యాన్ని వదిలించి, మరో సారి పట్టకుండా చూసుకొనే భద్యాత జనసేన పార్టీ చూసుకుంటుందన్నారు. మరో ఆరు నెలలే వైసిపి పాలన వుంటుందని తరువాత వైసిపి ముఖ్యమంత్రి ఇక జన్మలో కాలేరని అన్నారు. జనసేన పార్టీ ఎవరితో పొత్తు పెట్టుకున్న ప్రజల కోసమే అని, ఎవరినో ఉద్ధరించడానికి కాదని వివరించారు. కొంత మంది అధికారులు సైతం తమ తీరు మార్చుకోవాలని, ప్రజల కోసం పని చేయాలని సూచించారు. ఈ సమావేశంలో మల్లిక, శోబ, సునీత, గంగాదర్, శ్రీనాథ్, నాగేంద్ర, నరేష్, సోను, హర్ష, నికేష్, తదితరులు పాల్గొన్నారు.