ఎచ్ఛర్ల ( జనస్వరం ) : పవన్ కళ్యాణ్ గారికి ఎక్కడ నెగ్గ్గాలో, ఎక్కడ తగ్గాలో తెలుసు. అందుకే పొత్తులు కు సిద్ధపడ్డారని ఎచ్చెర్ల నియోజకవర్గ జనసేన నాయకులు, రాష్ట్ర కార్యనిర్వహణ వైస్ ప్రెసిడెంట్ డా విశ్వక్షేణ్ మీడియా కు తెలియజేశారు. ఆయన మాట్లాడుతూ వైఎస్సార్సీపీ కి ఉలికిపాటు ఎందుకు? రాజశేఖర్ రెడ్డి గారు అనుచరులు అందరూ జాయిన్ అవడం వల్ల వైఎస్సార్సీపీ పార్టీ ఏర్పడింది. వైఎస్ఆర్ పేరు లేకుండా, ఆయన పేరు తలచకుండా జగన్ సొంత పార్టీ ఎందుకు పెట్టలేదు? ఒక పార్టీ ప్రజాక్షేత్రంలో నిలదొక్కు కోవడానికి రెండు దశాబ్దాలు పడుతుంది. అందుకే పవన్ గారు పొత్తులకు మొగ్గు చూపారు. అది కుడా ప్రజల కోసమే. వైసీపీ అన్యాయమైన పాలన అంతం చేయడానికి.. 2019 కంటే మా జనసేన బలం బాగా పెరిగింది. మా ఓంటరి పోరు మీకు మేలు చేస్తుందని పొత్తులు వద్దని చెబుతున్నారు. ఒక పార్టీని ఎలా నడపాలి అని మీరు ఎలా చెబుతారు. మీకు ఉన్న హక్కు ఏమిటి.. మీలాగా బీజేపీతో దొంగ పొత్తు కోసం పాటు పడలేదే? ఉత్తరాంధ్రలో మొత్తం 34 చోట్లా వైఎస్సార్సీపీకి డిపాజిట్లు కూడా రావు.. ఆ స్థాయిలో ఆ పార్టీ తప్పులు చేసింది. ప్రజలందరితో మాకు పొత్తు వుంది. జన సైనికుల లక్ష్యం ప్రజా సంక్షేమం. అధికారం కాదని అందుకే పవన్ కళ్యాణ్ గారి నిర్ణయాన్ని గౌరవిద్దామని అన్నారు.