సర్వేపల్లి ( జనస్వరం ) : జనం కోసం జనసేన కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి వెళ్లి వైసీపీ ప్రభుత్వ నిరంకుశ పాలన, అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను వివరిస్తూ జనసేన పార్టీ సిద్ధాంతాలను తెలియజేయడం జరిగింది. బొబ్బేపల్లి సురేష్ నాయుడు మాట్లాడుతూ సర్వేపల్లి నియోజకవర్గంలో 15 నుంచి 20 కిలోమీటర్లు సముద్ర తీరం వుంది వందల మత్స్యకార కుటుంబాలు నివాసం ఉంటున్నారు. అయితే ఇప్పటికి ఇల్లులేని మత్యకారు కుటుంబాలు ఉన్నాయి. అదేవిధంగా వేటకు వెళ్లకపోతే వాళ్లకి పూట కూడా జరగనటువంటి పరిస్థితి. రాష్ట్ర ప్రభుత్వం 217 చీకటి జీవోని తీసుకువచ్చి వారికి ఉపయోగం లేనివిధంగా వారిని పూర్తిస్థాయిలో విస్మరించే విధంగా చేయాలనుకున్నది. ఈ విషయంపై మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఇటువంటి జీవోలని తీసుకురావద్దు అని జనసేన పార్టీ తీవ్రంగా ఖండించింది. మత్స్యకారులకు ఎప్పుడు కూడా జనసేన పార్టీ అండగా ఉంటుంది. అదేవిధంగా మత్స్యకారులు తుఫానుల సమయంలో తుఫాను వల్ల బోట్లకి నష్టం ఏర్పడితే ఆ నష్టాన్ని ప్రభుత్వమే భరించాలి. అదేవిధంగా వారికి వలలను అందించాలి. పెట్రోల్, డీజిల్ ని మోటర్లకి సబ్సిడీలో ఇవ్వాలి. వారిని అన్ని విధాల ఆదుకోవాలని చెప్పి మేము జనసేన పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం. మత్స్యకార సంపదని మనం కాపాడుకోవాలి. అదేవిధంగా ఏదైతే రాష్ట్రంలో 32 తెగలు మత్స్యకార కుటుంబాలు వీళ్ళందరికీ కూడా న్యాయం జరగాలని న్యాయం చేయాలని ప్రభుత్వని డిమాండ్ చేస్తున్న మ్. అదేవిధంగా మత్స్యకారులకు పూర్తిస్థాయిలో న్యాయం జరగాలంటే ఒక జనసేన పార్టీతోనే సాధ్యం. అది 2024లో మా అధినేత పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాబోతున్నారు. రాష్ట్రంలో వెనుకబడిన వారికి జనసేనతోనే న్యాయం జరుగుతుందని మేము తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమంలో స్థానికులు విజయ్, శ్రీహరి, ఖజా, నవీన్, సాయి, తదితరులు పాల్గొన్నారు.