తణుకు ( జనస్వరం ) : ఎన్నికల ముందు హామీలు ఇవ్వడం.. తర్వాత అడ్డగోలు వ్యవహారాలతో ప్రజల్ని ఇబ్బంది పెట్టడం.. ప్రభుత్వాలు, పాలకులు మారుతున్నా ప్రజల జీవన ప్రమాణాలు మారడం లేదని తుణుకు నియోజకవర్గ ఇంఛార్జ్ విడివాడ రామచంద్రరావు దుయ్యబట్టారు. తణుకు పట్టణంలోని అజ్రంపుంత ఇందిరమ్మ కాలనీలలో కనీస సౌకర్యాలు లేవన్నారు. టిడ్కో ఇళ్లలో గృహప్రవేశాలు ఎప్పుడో అర్ధం కాని పరిస్థితులు ఉన్నాయన్నారు. తణుకు పట్టణ పరిధిలోని 7వ వార్డు పరిధిలో జనం కోసం జనసేన కార్యక్రమం నిర్వహించారు. అజ్రంపుంత ప్రాంతంలో ఇంటింటికీ వెళ్లి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. జనసేన పార్టీ సిద్ధాంతాలు, పవన్ కళ్యాణ్ నాయకత్వ ఆవశ్యకతను ప్రజలకు వివరించారు. కార్య్రమలో పార్టీ నాయకులు కొమిరెడ్డి శ్రీనివాస్, గర్రె తులసీరామ్, పంతం నానాజీ, జవ్వాది ప్రసాదు, వెంపటాపు రమేష్, రిల్లు రాయుడు, మొఖమట్ల సతీష్, చివటం శీను, ఎండ్రా రత్న జ్యోతి, కామవరపు రూప, మంచం పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.