సర్వేపల్లి ( జనస్వరం ) : ముత్తుకూరు మండలం బ్రహ్మదేవం గ్రామం సాయిబాబా సంగం నందు జనం కోసం జనసేన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి వెళ్లి వైసీపీ ప్రభుత్వ నిరంకుశ పాలన, అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను వివరిస్తూ జనసేన పార్టీ సిద్ధాంతాలను బొబ్బేపల్లి సురేష్ నాయుడు తెలియజేయడం జరిగింది. ఆయన మాట్లాడుతూ ముత్తుకూరు మండలం బ్రహ్మదేవం గ్రామంకి కూసింత వేటు దూరంలో ఉన్న సాయిబాబా కాలనీ నందు 32 గిరిజన కుటుంబాలు కాలవ అంచున గుడిసెలో నివాసం ఉంటున్నారు. వాళ్లకి కనీసం తాగడానికి నీళ్లు కూడా లేక అల్లాడిపోతున్నారు. అదేవిధంగా వాళ్లకి ఇల్లు కట్టిస్తామని చెప్పి బేస్ మెంట్ మాత్రమే కట్టారు. ఇప్పటివరకు పూర్తిస్థాయిలో ఇల్లు నిర్మించి ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. వర్షాలు వస్తే ఆ గుడిసెల్లోనే మగ్గిపోతున్నారు. వాళ్లకి రేషన్ బియ్యం లో ప్లాస్టిక్ బియ్యం కల్తీ అయి వస్తున్నాయని చెప్పి వాళ్లు మా దృష్టికి తీసుకురావడం జరిగిందన్నారు. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. అదేవిధంగా వాళ్ళకి తాగునీరు లేకుండా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి వాళ్లకి ప్రతి ఇంటికి కూడా ఒక మినరల్ వాటర్ క్యాన్ ఉచితంగా ఇస్తామని చెప్పి హామీ ఇచ్చాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి నాలుగు సంవత్సరాలు అవుతుంటే ప్రజా సమస్యలను గాలికి వదిలేసి గ్రామాలలో ఎక్కడా కూడా అభివృద్ధి చేసిన దాఖలు లేవు అదేవిధంగా ఈ సర్వేపల్లి నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చేశారని చెప్పి ఈ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి చెప్పుకుంటున్నారు/ కానీ ఇక్కడ గ్రామాల్లో చూస్తే ఎక్కడ సమస్యలు అక్కడే ఉన్నాయి వాళ్ల సమస్యలు వినే పరిస్థితి కానీ, ఆ సమస్యలను తీర్చే ఆలోచన గాని లేనివిధంగా వీళ్ళ యొక్క ప్రవర్తన కొనసాగుతా ఉంది. త్వరలోనే వీళ్ళకి ముగింపు పలికే విధంగా ప్రజల్లో కూడా చైతన్యం తీసుకువస్తాం అదేవిధంగా ప్రజా సమస్యలపై మేము ఎప్పుడూ పోరాటం చేస్తాం వాళ్ల సమస్యలను పరిష్కరించే దానికి అడుగులు ముందుకు వేస్తామని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో శ్రీహరి, రహమాన్, జయంత్, తరుణ్, శశి, దుర్గ, తదితరులు పాల్గొన్నారు.