• నెల్లూరు సిటీ MLA అనీల్ కి స్లమ్ లో ఉండే ఓటర్ల పిల్లలు ఎమ్మెల్యే అనిల్ కి కనపడలేదా ?
• జగన్ మామయ్యా – మా స్కూలు మాకు కావాలి మామయ్యా
• మీ జీవోలు మాకు వద్దు మామయ్యా అంటూ పిల్లలు నిరసన
నెల్లూరు , (జనస్వరం ) : నెల్లూరులో సెయింట్ జోసెఫ్ స్కూల్ మూసివేతకు నిరసనగా పిల్లలు, తల్లిదండ్రులతో కలిసి స్కూలు వద్ద జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్, ఉపాధ్యక్షులు బద్దెపూడి సుధీర్ ఆధ్వర్యంలో నిరసన తెలిపి కలెక్టర్, DEOకి అర్జీ ఇచ్చారు. నెల్లూరు సిటీ స్థానిక సెయింట్ జోసఫ్స్ విద్యాసంస్థలు ఈ సంవత్సరం నుంచి మూసివేస్తారనీ, మీరు వేరే స్కూల్ చూసుకోవాల్సిందిగా నిర్వాహకులు తెలపడంతో దాదాపు 150 మంది విద్యార్థులు చదువుతున్న తల్లిదండ్రులు మూసి వేయడానికి ఒప్పుకోమని ప్రభుత్వం ప్రభుత్వ చర్యలు వ్యతిరేకిస్తూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారికి మద్దతుగా జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి కిషోర్ మాట్లాడుతూ…ఎయిడెడ్ స్కూల్ అభివృద్ది గమనించడానికి వేసిన కమిటీ నిర్ధారించిన మూడు విషయాల్లో మొదటిది హ్యాండ్ ఓవర్ చేసుకోవటం. రెండవ విధానం స్కూల్లను మోసివేసి టీచర్లను గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసే విధానాలనే ఎన్నుకుంటున్నారు కానీ యధావిధిగా కొనసాగించేందుకు అవసరమైన సౌకర్యాలు ఏర్పాటు చేయడంలో జగన్ ప్రభుత్వం విఫలమైంది. నెల్లూరు సిటీ స్లమ్స్ లో ఉండే పేదలకు ఎంతోమందికి ఉచిత విద్యను అందించిన ఈ స్కూల్స్ మూసి వేయడం దారుణం. స్థానిక ఎమ్మెల్యే సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ ఈ విషయంలో వేడుక చూస్తున్నట్లుగా ఉన్నారు. ఈ ప్రాంతంలో గవర్నమెంట్ స్కూల్ ఏది? ఆల్టర్నేట్ లేకపోవడంతో వారందరూ వీధిని పడే పరిస్థితి ఉంది. సేయింట్ పీటర్ సెయింట్ జోసెఫ్ స్కూల్స్ నెల్లూరు హెరిటేజ్ వంటివి వాటిని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. స్కూల్ ని మూసి వేయడానికి కూడా ఒక ప్రణాళిక ఉంది కొత్త అడ్మిషన్ క్లోజ్ చేసి, ఎవరైతే చదువుతున్నారో వాళ్ళ విద్య పూర్తి అయిపోయేదాకా వెయిట్ చేయడం లేకపోతే వాళ్ళని వేరే స్కూల్ కి ఎండర్స్ చేయడం చేయాలి. అంతంత మాత్రం తెలివిగల ఈ తల్లిదండ్రులు అంత దూరం పోలేరు. ఎవరికి కూడా బయట ప్రైవేట్ స్కూళ్లలో ఫీజు కట్టే స్తోమత లేదు. దగ్గర్లో గవర్నమెంట్ స్కూల్ లేదు. విషయం కలెక్టర్, డీఈఓ దృష్టికి తీసుకెళ్లి స్కూల్ తీయకుండా ఉండేందుకు మా శక్తి మంచం లేకుండా కృషి చేస్తామని జనసేన పార్టీ నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్కూల్ పిల్లల తల్లిదండ్రులతోపాటు జనసేనపార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్, సుధీర్ బద్దెపూడి, మౌనేష్, కార్యదర్శి ప్రశాంత్ గౌడ్, హేమచంద్ర యాదవ్, బన్నీ, వర, ఇబ్రహీం, నారాయణ, ఖలీల్ తదితరులు పాల్గొన్నారు.