ఉంగుటూరు, (జనస్వరం) : రాష్ట్రంలో అన్ని రంగాలు అధోగతి పాలయ్యాయని ముఖ్యంగా రైతాంగం మరింత ఇబ్బంది గురవుతున్నారని ఈ పరిస్థితి మారాలంటే పవన్ కళ్యాణ్ రావాలని ఉంగుటూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ పత్సమట్ల ధర్మరాజు పేర్కోన్నారు. మంగళవారం గణపవరం మండలం ముగ్గళ్ల గ్రామంలో జనంలోకి జనసేన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత ప్రభుత్వ హయాంలో ఆక్వా వరి రైతులు తీవ్ర నిర్లక్ష్యానికి గురయ్యాయన్నారు. పంచాయితీలలో అభివృద్ధి లేక జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో గ్రామ పంచాయతీ వ్యవస్థ ఉందన్నారు. కనీసం మంచినీరు వ్యవస్థ కూడా సక్రమంగా అందించలేని స్థితిలో గ్రామపంచాయతీలు ఉన్నాయి సిమెంట్ రోడ్లు డ్రైన్లు నిర్మించలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నిజాయితీపరుడు పవన్ కళ్యాణ్ కు మద్దతు ఇచ్చి ముఖ్యమంత్రిగా చేస్తే గ్రామీణ ప్రాంతాలతో పాటు రైతన్నలు అభివృద్ధి చెంది అందరికీ ఉపాధి దొరుకుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు వంగా రఘు, తానేటి జోగేశ్వరరావు, ఎస్.అయ్యప్ప, పి శ్రీనివాసరావు, కొండబాబు, రేపాక కేశవ నాయుడు, ప్రభాకర్ రావు, బోరాల నారాయణ, దేవరపు లక్ష్మీ, గ్రామ అధ్యక్షుడు తిప్పిరి శెట్టి గోపాల్, చినిమిల్లి నరేష్, కాకర్లరాజేష్, మణికుమార్, పంజా గణేష్, కాకర్ల విజయ్, సిహెచ్ వరప్రసాద్, వీర్ల బాబి, దేవరపు చిన్ని, కే సుబ్బయ్య జనసేన నాయకులు, కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.