పిఠాపురం ( జనస్వరం ) : డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ (భీంరావ్ రాంజీ అంబేడ్కర్) గారి జయంతిని పురస్కరించుకుని పిఠాపురం నియోజవర్గం ఇంచార్జ్ శ్రీమతి మాకినీడి శేషు కుమారి ఆధ్వర్యంలో జయంతి వేడుకల్లో పాల్గొని అంబేద్కర్ గారికి ఘన నివాళులు అర్పించడం జరిగింది. పిఠాపురం పట్టణ స్థానిక రథాలపేట, పశువుల సంత, పిఠాపురం మండలం రాపర్తి, పి.రాయవరం, చిత్రాడ, పిఠాపురం టౌన్ ఇంద్రనగర్, యు కొత్తపల్లి మండలం యండపల్లి జంక్షన్ వాకతిప్ప ప్రాంతాల్లో అంబేద్కర్ యువజన సంఘాల ఆధ్వర్యంలో జరిగిన జయంతి ఉత్సవాల్లో పిఠాపురం నియోజవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ మాకినీడి శేషుకుమారి గారు పాల్గొని అంబేద్కర్ గారికి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా శేషుకుమారి గారు మాట్లాడుతూ బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి విగ్రహాలు నెలకొల్పడం తోపాటు అంబేద్కర్ భావజాలాన్ని ముందుకు తీసుకెళ్లాలని అయన పిలుపునిచ్చారు. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాన్ని బోధించే మతాన్ని తాను నమ్ముతానని, జీవితం సుదీర్ఘంగా కాకుండా గొప్పగా ఉండాలని ఆయన నమ్మారు. కులమత బేధాలు లేని సమాజం కోసం ఆయన చేసిన కృషి వైవిధ్యమైనదని, విభిన్న సంస్కృతులు కలిగిన భారత దేశంలో అన్ని వర్గాలకు న్యాయం జరిగేలా మరియు భారత ఔనత్యం ప్రపంచానికి తెలిసేలా భారత రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ గారికి మనమందరం కృతజ్ఞులమని అన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారు కేవలం ఎస్సీ, ఎస్టీ వర్గాలకు మాత్రమే చెందినవాడు కాదు ఆయన అందరివాడని, ఆయన్ను ఒక్క కులానికో వర్గానికో పరిమితం చేసే కుట్ర కొంతకాలంగా జరుగుతుందని, అలాగే ప్రతి గుడిసెకు, ప్రతి పౌరుడికి ప్రభుత్వ సంక్షేమ పధకాలు అందిన నాడే అంబేద్కర్ గారి కల సాకారమవుతుందనీ పేర్కొన్నారు. ఆయన వేసిన బాటలో భారత యువత అంతా నడిచి దేశన్ని ప్రతి రంగాన్ని ప్రగతి పథంలో నడిపించాలని యువతకి విజ్ఞప్తి చేశారు.