విజయవాడ ( జనస్వరం ) : విజవాడ పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జ్ పోతిన వెంకట మహేష్ ఏడవ రోజు ఇంటింటికి రాబోయే మన జనసేన ప్రభుత్వం 56 వ డివిజన్ డివిజన్ అధ్యక్షులు పిల్లా వంశీ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో యర్రకట్ట డౌన్ వద్దనుండి ప్రారంభించి old R.R Peta, ఉర్దూ స్కూల్ పరిసర ప్రాంతాల్లో పర్యటించడం జరిగింది. ఒక్క అవకాశం ఇచ్చినందుకు ఏ రాష్ట్రాన్ని సీఎం జగన్ తన పాలన ద్వారా సర్వనాశనం చేశారని ఇదే చిట్టా చివరి అవకాశమని రాబోయే ఎన్నికల్లో ప్రజలు వైయస్ఆర్సీపీ పార్టీకి తగిన గుణపాఠం చెబుతారని పవన్ కళ్యాణ్ కు పట్టం కడతారన్నారు.పాత రాజరాజేశ్వరి పేట ఉర్దూ స్కూల్ పరిసర ప్రాంతాల్లో నేడు ఇంటింటికి రాబోయే మన జనసేన ప్రభుత్వ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ ప్రాంతంలో స్థానికులు కాలువలు సరిగా లేవని ,వీధి లైట్లు వెలగడం లేదని, సెంటు భూమి పథకం పెద్ద మోసమని, కుల ధ్రువీకరణ పత్రాలు కావాలనే జారీ చేయడం లేదని, ఒంటరి మహిళలకు సెంటు భూమి పథకం ఎందుకు వర్తించదని, రైల్వే అధికారులు పదే పదే మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం పవన్ కళ్యాణ్ గారి ద్వారా తమరే మాకు చూపాలని, చెత్త తీసేందుకు కూడా ఫిర్యాదు చేయవలసి వచ్చే పరిస్థితులు ఈ వార్డులో ఏర్పడ్డాయని స్థానిక ప్రజలు ఎన్నో సమస్యలను తెలియజేశారు. మీడియా పాయింట్ వద్ద మహేష్ మాట్లాడుతూ రాష్ట్రానికి వైఎస్ఆర్సిపి గ్రహణం పట్టిందని ఒక్క అవకాశం ఇచ్చినందుకు సీఎం జగన్మోహన్ రెడ్డి చేసిన పాపాలు రాష్ట్ర భవిష్యత్తుకు శాపాలుగా మారాయని, లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి ఆంధ్రప్రదేశ్ ను అప్పులు ఆంధ్రప్రదేశ్ గా మార్చేశారని, అమరావతి పోలవరం ను పూర్తిగా విస్మరించారని, EBC నేస్తమంటున్న సీఎం జగన్ EBC లను చాలా దారుణంగా మోసం చేశారని కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 10% రిజర్వేషన్లు ఎందుకు అమలు చేయడం లేదో చెప్పాలని, ఈ 10 శాతం లో ఐదు శాతం కాపులకు కేటాయించిన రిజర్వేషన్లను కావాలని అమలు చేయడం లేదని మిగిలిన ఐదు శాతం లో రెడ్డి కమ్మ బ్రాహ్మణ వైశ్య క్షత్రియ తదితర అగ్రవర్ణాలను కావాలనే మోసం చేస్తున్నారని ముందు దీనిపై సీఎం జగన్ గారి సమాధానం చెప్పాలని మహేష్ డిమాండ్ చేశారు. ఒక్క అవకాశం ఇచ్చినందుకు ఏ రాష్ట్రాన్ని సీఎం జగన్ తన పాలన ద్వారా సర్వనాశనం చేశారని ఇదే చిట్టా చివరి అవకాశమని రాబోయే ఎన్నికల్లో ప్రజలు వైయస్ఆర్సీపీ పార్టీకి తగిన గుణపాఠం చెబుతారని పవన్ కళ్యాణ్ కు పట్టం కడతారన్నారు.
డివిజన్ అధ్యక్షులు పిల్ల శ్రీనివాస వంశీ మాట్లాడుతూ డివిజన్లో సమస్యలు చెప్పుకునేందుకు కార్పొరేటర్ అందుబాటులో లేరని కాలువలకు మరమ్మత్తులు చేయడం లేదని, వీధి దీపాలు బాగు చేయడం లేదని, చెత్త సేకరించడం లేదని, అర్హులైన వారికి కూడా పెన్షన్లు రద్దు చేశారని, సెంటు భూమి పథకం పెద్ద మోసమని ఇంతవరకు ఆ స్థలం ఎక్కడ ఉందో చూపలేదని కేవలం ఇవి ప్రచారం కోసం చేస్తున్నారని, ఇంటింటికి రాబోయే మన జనసేన ప్రభుత్వం కార్యక్రమంలో ప్రజలు ఎదురొచ్చి మరి వారి సమస్యలు తెలియజేస్తున్నారని ఈ ప్రభుత్వంలో ప్రజలకు ఉపయోగం లేదని రాబోయే ఎన్నికల్లో వైసీపీని ఓడించి పోతిన మహేష్ గారిని జనసేన తరఫున పశ్చిమ నియోజకవర్గంలో గెలిపించాలన్నారు. నగర అధికార ప్రతినిధి ముద్దాన స్టాలిన్ శంకర్ మాట్లాడుతూ పశ్చిమ నియోజకవర్గంలో అడుగడుగునా అవినీతి తాండవిస్తుంది కానీ అభివృద్ధి జాడలు ఎక్కడా లేవని స్థానిక ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు నియోజకవర్గ అభివృద్ధిని పూర్తిగా గాలికి వదిలేసారని, అర కిలోమీటర్ రోడ్డు వేయడానికి కూడా రెండు సంవత్సరాల సమయం తీసుకుంటున్నారని, ప్రభుత్వ స్థలాలను వెల్లంపల్లి ట్రస్ట్ పేరుతో కబ్జా చేస్తున్నారని, ప్రజలు తమ సమస్యలను పోతిని మహేష్ గారికి చెప్పుకుంటే ఉపశమనం కలుగుతుందని వారు మాత్రమే ఈ నియోజకవర్గంలో అండగా నిలబడగలరని నమ్మి వారితో ప్రజల నడుస్తున్నారని రాబోయే ఎన్నికల్లో వైసీపీ ఓటమి తద్యమని పశ్చిమంలో పోతిన మహేష్ గెలుపు ద్వారానే అభివృద్ధి సాధ్యమన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు దాసిన జగదీష్, నుచర్ల పవన్ కళ్యాణ్, దేవకి, G మురళి, చాంద్బాషా డివిజన్ అధ్యక్షులు ఆకుల రవిశంకర్, రెడ్డిపల్లి గంగాధర్ ,కొరగంజి వెంకటరమణ, బత్తుల వెంకటేష్, సిగానంశెట్టి రాము, మల్లెపు విజయలక్ష్మి , తిరుపతి అనూష, తమ్మిన లీలా కరుణాకర్, ఏలూరు సాయి శరత్, అడ్డూరి తమ్మారావు ,వెన్న శివశంకర్ , స్టాలిన్ శంకర్, పాల రజిని, బోట్టా సాయి, తదితరులు పాల్గొన్నారు