వెంకటగిరి నియోజకవర్గ కలువాయి మండలంలో జనసేన పార్టీ ఆత్మీయ సమావేశం

వెంకటగిరి

      వెంకటగిరి ( జనస్వరం ) : అణగారిన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వంటి మహానుభావులు మార్గంలో నడిచే నాయకుడు పవన్ కళ్యాణ్ గారు, ఏప్రిల్ 14వ తేదీన అంబేద్కర్ జయంతి పురస్కరించుకొని కలువాయి బస్టాండ్ లో చలివేంద్రం ప్రారంభిస్తున్నట్టు తెలిపారు. రాజ్యాధికారాన్ని అన్ని వర్గాల వారికి అందించాలనేదే ఆయన తపన, ఎంతో విలాసవంతమైన జీవితాన్ని వదులుకొని సమాజ సేవ కోసం పరితపిస్తున్న పవన్ కళ్యాణ్ గారిని 2024 లో సీఎం చేసుకునే విధంగా ప్రతి జన సైనికుడు తోడ్పడాలని మండలంలోని ప్రతి గ్రామానికి పార్టీ యొక్క సిద్ధాంతాలను పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను, భావజాలాలను తీసుకెళ్లే విధంగ జన సైనికులు కృషి చేయాలని చర్చించారు. సమస్యలపై జనసైనికులు గళం ఎత్తాలని కోరారు, రానున్న రోజుల్లో జన సైనికులు అందరూ సమిష్టిగా నిలబడి జనసేనని పవన్ కళ్యాణ్ గారి నిర్ణయం ఏదైనా కూడా వారిని గెలిపించేందుకు అందరూ సహాయ సహకారాలు అందించాలని జనసేన నాయకులు తెలియజేశారు. ఈ ఆత్మీయ సమావేశానికి కలువాయి మండల జనసైనికులు, ముఖ్య అతిథిగా అనంతసాగర్ మండలాధ్యక్షుడు షేక్ మహబూబ్ మస్తాన్, వీర మహిళ ప్రవళిక, శ్రీహరి, వెంకటపతి, రామ కిషోర్, నరేష్, రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

See also  వైసీపీ, టిడిపి ఇతర వర్గాల నుండి జనసేనపార్టీలో చేరిక