దోమల్ని తరిమికొడదాం మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం : లోకం మాధవి

లోకం మాధవి

     నెల్లిమర్ల ( జనస్వరం ) : నెల్లిమర్ల నియోజకవర్గంలో గ్రామ గ్రామంలో పర్యటిస్తున్న లోకం మాధవి గారికి ఎంతో మంది ప్రజలు మొరపెట్టుకున్న ప్రధాన సమస్య పారిశుధ్యం సరిగ్గా లేకపోవడం. దీనివలన దోమలు ఎక్కువ గా ప్రబలి చిన్న పిల్లలు మరియి పెద్దవారు అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారని మలేరియా, డెంగ్యూ ఎక్కువగా ఉందని కొంతమంది ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చాలా మంది అధిక వ్యయంతో ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారని ఖచ్చితంగా మీరు ఈ విషయంలో స్పందించాలి అన్నపుడు వివిధ పంచాయతీ సెక్రటరీలతో మాట్లాడారు లోకం మాధవి. ఆమెకి ఆశ్చర్యం కలిగించిన విషయం ఏంటంటే పంచాయితీ రికార్డులలో అయితే దోమల మందు కొట్టినట్టు ఉంది. కానీ, అక్కడ కార్యచరణ అయితే జరగలేదని లోకం మాధవి గారు తెలిపారు. ఏ ప్రాంతానికి వెళ్లిన ఇది ప్రధాన సమస్యగా గుర్తించి మా సొంత వ్యయంతో ప్రతి పంచాయతీలో ఈ దోమల మందు కొట్టించాలని నిర్ణయించుకున్నామని లోకం మాధవి తెలిపారు.

See also  వైస్సార్సీపీ దౌర్జన్యాలను, ఒత్తిడి ని ఎదుర్కొని పోరాడి గెలిచిన వీర మహిళ మౌనిక గారు - నెల్లూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి