ఆముదాలవలస ( జనస్వరం ) : ఏళ్ళతరబడి రాజకీయలో ఉద్దపండితులుగా ఉన్న మీకు ప్రజా ఆవేదన రోడ్ల దుస్థితి కనపడటం లేదా ? జనసేన నాయకులు ఉదయ్ శంకర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ రెండూ నియోజకవర్గాలకు ప్రధాన రహదారి, నిత్యం రాకపోకలుతో రద్దీ, సుదూర ప్రాంతాలకు వెళ్ళే వాళ్ళకి అందుబాటులో ప్రధాన రైల్వే స్టేషన్, నిత్యము వ్యాపార రాకపోకలు, వైద్యం కోసం జెమ్స్ హాస్పిటల్ ఇలా ఎన్నో వాటితో నిరంతరం రద్దీగా ఉండే రహదారి. పాలకులు మారుతున్న రోడ్ దుస్థితి మారదు, ప్రతి వారం ఏక్సిడెంట్ ఏడాదికి 20 పైన మరణాలు సంభవించిన నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న అధికారులు & ప్రభుత్వం. రాష్ట్ర ప్రజా శ్రేయస్సు కోసం ప్రజా పక్షంలో జన సేన అధినేత రోడ్ల సమస్యా గుర్తు చేయడం జరిగింది, అప్పటి నుంచీ నాయకులు అధికారులు టెండర్ టెండర్ అని వివరణలు ఇవ్వటం తప్పా ఫలితం శూన్యం. రోడ్ ప్రమాదం లో క్షతగత్రులు మీరు మీ కుటుంబ సభ్యులు అయితే అప్పుడూ స్పందిస్తారా అని శ్రీకాకుళం నియోజక వర్గ జనసేన నాయకుడు ఉదయ్ శంకర్ ప్రశ్నించారు. శ్రీకాకుళం ఆముదాలవలస ప్రధాన రహదారి సమస్యా పరిష్కారం పేరుతో 4ఏళ్లుగా ఇరు నియోజక వర్గ ప్రజలను ఏప్రిల్ ఫూల్ చేయడం మానుకోవాలని హితవు పలికారు. శ్రీకాకుళం జనసేన నాయకులు బమ్మిడి సిద్దు. జనసేన అధ్యక్షుల స్ఫూర్తి తో గతంలో కూడా ఇదే ఆంధ్ర ప్రదేశ్ రోడ్స్ పరిస్థితి పై ప్రభుత్వ అధికారులు & ప్రభుత్వంకి చూపించడం జరిగింది. సమస్యపై కళ్యాణ్ గారు గళం ఎత్తిన ప్రతిసారీ నేటి ప్రభుత్వం తుతు మంత్రంగా చర్యలు తీసుకుంటున్నట్టు సోషల్ మీడియా ప్రచారాలు, కొందరు వైసీపీ నాయకులు ప్రెస్ మీట్ తప్పా నేటికీ ఏక్కడ ఎలాంటి కార్యాచరణ లేదు. ముఖ్యంగా ఇద్దరూ మంత్రులు& ఒక స్పీకర్ ఉన్న మన శ్రీకాకుళం జిల్లా లో. రెండూ నియోజక వర్గాలకు ఇద్దరూ సీనియర్ మంత్రులూ ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రధాన రహదారి అయిన శ్రీకాకుళం అముదల వలస ప్రధాన రహదారి ఇప్పటికి దయనీయ స్థితిలో ఉంది. 4ఏళ్లుగా ఎన్నో ఏక్సిడెంట్ ఎందరో మృత్యు ఒడిలోకి చేరిన ఈ నాయకులు ప్రజా సమయాలను కనీసం పట్టించుకోవడం లేదు. శ్రీకాకుళం అముదల వలస ప్రధాన రహదారి లో ప్రముఖ హాస్పిటల్ అయిన జెమ్స్, ఎన్నో విద్యాసంస్థలు , కర్మాగారాలు దారి ఇంతటి దయనీయ స్థితిలో ఉండడం చాలా బాధాకరం. ఇప్పటికైనా ఓట్లు వేసి గెలిపించిన ప్రజలా కన్నీరు తుడవాలి అని శ్రీకాకుళం జన సేన నాయకులు బమ్మిడి సిద్దు కోరుతున్నారు.