దెందులూరు ( జనస్వరం ) : తిమ్మనగూడెం గ్రామ జనసైనికులు స్థానిక వై.సి.పి నాయకులు గుంతలు పడిన తారు రోడ్డును మట్టితో పూడ్చిన వైనం గురించి సోషల్ మీడియాలో ప్రశ్నించినందుకు వారిని రెచ్చగొట్టే విధంగా పోస్టులు పెట్టారు. జనసైనికులు స్పందించినందుకు తిరిగి వారిపైనే పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసి, అర్థరాత్రి స్టేషనుకు పిలిపించి విచారించి, మరల ఉదయాన్నే రమ్మనడం జరిగింది. ఈ విషయాన్ని స్థానిక జనసైనికులు దెందులూరు నియోజకవర్గ జనసేన నాయకులు కొఠారు ఆదిశేషు గారి దృష్టికి తీసుకురాగా వారు వెంటనే స్పందించి సంబంధిత పోలీసు అధికారులు (సి.ఐ, ఎస్.ఐ గార్లతో) మాట్లాడి జనసైనికులను స్టేషను నుండి పంపించవలసిందింగా కోరడం జరిగింది. తదుపరి వారిని స్టేషను నుండి విడిపించి తీసుకురావడానికి జనసేన నాయకులు మేడిది రిత్వి గారు అందుబాటులో ఉండటంతో వారిని మరియు దేశంశెట్టి వాసు గార్లను స్టేషను వద్దకు పంపడం జరిగింది. మేడిది రిత్వి గారు ఫిర్యాదు చేసిన వై.సి.పి నాయకులతో సామరస్యంగా మాట్లాడి, పోలీసు వారి సమక్షంలో ఇరువురికి తగు సూచనలు అందించి, జనసైనికులను సురక్షితంగా తీసుకురావడం జరిగింది. ఈ విషయంపై కొఠారు ఆదిశేషు గారు స్పందించి, ప్రభుత్వ పాలనా వైఫల్యాలను ప్రశ్నించినందుకు కేసులు పెట్టినా జనసైనికులు ఏ మాత్రం బెదిరిపోరని, వైఫల్యాలను ఎత్తిచూపి, ప్రజా సమస్యలపై జనసేన పోరాడుతూనే ఉంటుందని, జనసైనికులందరికీ పార్టీ తరుపున ఎల్లవేళలా అందుబాటులో ఉంటామని, ఎవరూ భయపడవలసిన పనిలేదని భరోసా ఇచ్చారు.