నెల్లిమర్ల ( జనస్వరం ) : నెల్లిమర్ల మండలం చిన్న బురాడపేట గ్రామంలో గత మూడేళ్లుగా చెరువుకి గండి పడటం వలన సుమారు 60 మంది రైతులు పంట నష్టానికి గురైనారు. నిరుపయోగంగా ఉండి ఏమి చేయలేక సతమతమవుతుంటే కనీసం నియోజకవర్గ నాయకులు కానీ, ప్రభుత్వ యంత్రాంగం కానీ రాష్ట్ర నాయకులు కానీ ఎవరు స్పందించక బాధపడుతుంటే వాళ్లతో మాట్లాడి వాళ్లకి చేయూతనివ్వాలని నెల్లిమర్ల జనసేన నాయకురాలు లోకం మాధవి ఆలోచించారు. ఆ ప్రాంతాన్ని ఆదివారం లోకం మాధవి పరిశీలించి వెంటనే జేసీబీ ని పిలిచి అక్కడ పనులను ప్రారంభించమని చెప్పారు. అలాగే అక్కడ రైతులు చెబుతున్నట్టు సుమారు 385 ఎకరాల పొలానికి కనీస రహదారి కానీ, కనీసం రవాణా సౌకర్యం లేదు అని, వారు ఎరువులు కానీ పంట కానీ నెత్తి మీద మోసుకొని సుమారు రెండు కిలోమీటర్లు నడిచి వెళ్ళవలసి వస్తుందని రైతులు వాపోయారు. కనీసం రహదారి మీద కూడా నాయకులు నుండి ఎటువంటి స్పందన లేదని వారిని కనీసం పట్టించుకోవట్లేదని రైతులు చెప్పారు. రెవిన్యూ డివిజన్లో మార్పు వల్ల ఆ సమస్య ఇంకా పెద్దదైనది కానీ సమస్య ఓ కొలిక్కి రాలేదు అని రైతులు లోకం మాధవితో చెప్పారు. దీని పైన తను తప్పకుండా సమిష్టిగా రైతు సమస్యలను పరిష్కరించుకుంటూ, జనసేన పార్టీ ఎప్పుడు రైట్లుకి అండగా ఉంటాదని అని లోకం మాధవి తెలిపారు. ఈ కార్యక్రమంలో బెల్లాన శ్రీనివాస్, పతివాడ శ్రీనివాస్, కోట్ల ధనంజయ్ తదితరు నాయకులు పాల్గొన్నారు.