రామ్ చరణ్ జన్మదిన సందర్భంగా విశాఖ పశ్చిమలో జనసేన నాయకుల ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరాలు

రామ్ చరణ్

  విశాఖపట్నం ( జనస్వరం ) : విశాఖ పశ్చిమ నియోజకవర్గం, పారిశ్రామిక ప్రాంతం, 62వ వార్డులో, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి పుట్టినరోజు సందర్భంగా జనసేన పార్టీ  నాయకులు ముప్పిన.ధర్మేంద్ర గారి సమక్షంలో ఉచిత కంటి వైద్య శిభిరం ఏర్పాటు చెయ్యటం జరిగింది. ఇందులో ప్రజలు పెద్ద ఏతున్న పాల్గొని కంటి పరీక్ష చేయించుకోవటం జరిగింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన బ్లైండ్నెస్ కంట్రోల్ సొసైటీ వాలకి అలాగే Dr. రాజు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలపటం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గాజువాక జనసేన నాయకులు అయిన కరణం.కనకరావు, దుంగ.దేవన్ రాజు, మొజ్జాడి.చంద్రమౌళి, నగేష్, ప్రేమ్ కుమార్, వంశీ, తులసి రామ్, రాజేష్, శివ తదితరులు పాల్గొని ఈ యొక్క క్యాంప్ ను విజయవంతం చేశారు.

See also  విశాఖపట్న౦ జిల్లా : పెరిగిన విద్యుత్ చార్జీలపై జనసేన పోరాటం