నంద్యాల ( జనస్వరం ) : ఆలూరు మండలం చుట్టుపక్కల గ్రామాల్లో త్రాగునీటి సమస్యలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని జనసేన వీర మహిళ ఏరుకుల పార్వతి అన్నారు. ఆలూరు మండలం చుట్టుపక్కల గ్రామాలు పరిస్థితి ఇలా ఉంటే మిగతా ఐదు మండలాల గ్రామాల పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించాలని ఇక్కడ ఉన్న నాయకులను అధికారం మేము అడుగుతున్నాము అన్నారు. పది పదిహేను రోజులకు ఒకసారి త్రాగునీరు వదలడం వలన ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అన్నారు. అధికారులు మాత్రం చుట్టపు చూపుగా చూసి వెళుతున్నారే తప్ప కానీ చుట్టుపక్కల గ్రామాలలో సమస్యలు అలాగే ఉండిపోయిందని రహదారులు డ్రైనేజీ తాగునీరు సదుపాయాలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంటే నియోజకవర్గం నాయకులు అధికారులు మాత్రం చీమకుట్టినట్టు వ్యవహరిస్తున్నారని అన్నారు. మట్టి రహదారులు అద్వాన స్థితికి చేరుకుందిని రహదారులపై గుంతలు కంకర రాళ్లు తేలడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. అదేవిధంగా అనారోగ్యానికి గురైతే బాలింతలు గర్భిణీ స్త్రీలు గ్రామాల్లో నుండి ప్రభుత్వ ఆసుపత్రికి రావాలన్నా రోడ్డు సౌకర్యం లేకపోవడంతో నిండు గర్భిణీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆలూరు నియోజకవర్గం ఆరు మండలాల గ్రామాల పరిస్థితి ఇలా ఉంటే కర్నూలు జిల్లాలో మండలాల గ్రామాల పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించాలని జనసేన వీర మహిళ ఎరుకుల పార్వతి అన్నారు. ఇప్పటికైనా ప్రజల సమస్యలపై స్పందించి గ్రామంలో సమస్యలను పరిష్కరించాలని నియోజకవర్గం నాయకులను అధికారులును కోరుకుంటున్నానని అన్నారు.