శ్రీకాళహస్తి ( జనస్వరం ) : ఏర్పేడు మండలం, చిందే పల్లి గ్రామానికి వెళ్ళే R&B రోడ్డు ను LANCO/ECL ఫ్యాక్టరీ యాజమాన్యం మూసివేయడం జరిగింది. రెవెన్యూ అధికారులు, జిల్లా కలెక్టర్ గారి దగ్గరకి సమస్య తీసుకుని వెళ్ళినా ఎవరు స్పందించలేదు. శాంతి యుతంగా గ్రామస్థులు , మేము నిరసన తెలుపుతూ ఉంటే పోలీస్ లు గ్రామస్తులను, మమ్మల్ని అక్రమం గా అరెస్టులు చేస్తూ, కేసులు పెడుతూ, గ్రామస్థుల పై లాఠీ ఛార్జ్ చేస్తే బయబ్రంతులకు గురిచేస్తున్నారు. రెవెన్యూ అధికారులు, పోలీస్ అధికారులు ఫ్యాక్టరీ యాజమాన్యం తో కుమ్మకై ప్రజలను తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారు. ఎక్కడ వారి నిరసన తెలపాలన్నా ఇబ్బందులకు గురి చేస్తున్నారని శ్రీకాళహస్తి జనసేన ఇంచార్జ్ వినుతా కోటా ఆవేదన వ్యక్తం చేశారు. ఈరోజు గ్రామస్థులతో కలిసి జనసేన పార్టీ శ్రీకాళహస్తి నియోజకవర్గం ఇన్చార్జి శ్రీమతి వినుత కోటా గారు ఏర్పేడు మండలం, చిందేపల్లి గ్రామంలోని శివాలయం నందు రాజ్యంగబద్దంగా , శాంతి యుతంగా నిరాహార దీక్షమొదలు పెట్టాము. మా నిరాహార దీక్ష చిందే పల్లి గ్రామానికి వెళ్ళే రోడ్డు పై కట్టిన అక్రమ గోడను తొలగించే వరకు కొనసాగుతుంది. మాతో పాటు గ్రామస్థులు, మహిళలు పెద్ద ఎత్తున నిరాహార దీక్షలో స్వచ్చందంగా పాల్గొంటున్నారు.