పెందుర్తి ( జనస్వరం ) : విశాఖ పశ్చిమ మరియు పెందుర్తి నియోజకవర్గ 89, 88 వార్డ్ ల సరిహద్దు ప్రాంతమైన కొత్తపాలెం నుండి నరవ గ్రామం కి వెళ్లే రహదారి చర్చి వద్ద కొద్దిపాటి వర్షానికి ఎగువ ప్రాంతం నుండి నీరు రహదారిపై వచ్చి నిలవ ఉండడం వలన వాహనదారులకు పాదచారులకు తీవ్ర ఇబ్బందులకు గురై యాక్సిడెంట్లు కూడా జరుగుతున్నాయని జనసేన పార్టీ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక నాయకులు మాట్లాడుతూ పెద్దపెద్ద వర్షాలు తుఫాను పడుతున్నప్పుడు మాత్రమే మేగాద్రిగడ్డ రిజర్వాయర్ మరియు ఎగువ ప్రాంతం నుండి నీరు వచ్చేదని కానీ ఇప్పుడు చుట్టూ ఉన్న లేఔట్ లో నిర్మాణాలు చేపట్టడం, లేఔట్ రహదారులను నీరు వెళ్లే ప్రవాహ మార్గానికి అడ్డంగా వేయడం వలన కొద్దిపాటి వర్షాలు కూడా రోడ్డుమీద నీరు వచ్చి నిల్వ ఉండిపోతుందని అన్నారు. పలుమార్లు అధికారులకు జనసేన పార్టీ ద్వారా అభ్యర్థించిన సమస్య పరిష్కారానికి మార్గం చూపడం లేదని, దీనివలన రహదారిని ఉపయోగించే సుమారు 30 గ్రామాల ప్రజలు వాహనదారులు పాదచారులు ఇబ్బంది గురై యాక్సిడెంట్లు కూడా జరుగుతున్నాయని అన్నారు. నీరు నిలవడం వల్ల రోడ్డు మార్గం కూడా తీవ్రంగా పాడైపోయిందని, నీరు నిలవడం వలన చుట్టూ నివసిస్తున్న ప్రజలకు కూడా ఆరోగ్యమైన సమస్యలు వస్తున్నాయని దయచేసి అధికారులు, స్థానిక పాలక నాయకులు వెంటనే స్పందించి నీరు నిల్వచేరకుండా తగు చర్యలు చేపట్టాలని జనసేన పార్టీ ద్వారా కావడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో స్థానిక జనసైనికులు వబ్బిన జనార్థన శ్రీకాంత్, జోగ వెంకటేష్, నాగం ప్రశాంత్, చామర్తి జయదీప్, చిడిపల్లి ప్రశాంత్ మరియు జన సైనికులు పాల్గొన్నారు.