రాజంపేట ( జనస్వరం ) : ముఖ్యమంత్రి ప్రకటనలు మాని రైతాంగాన్ని ఆదుకోవాలి లేకుంటే జనసేన పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయాల్సి ఉంటుంది తాతంశెట్టి నాగేంద్ర అన్నారు. ఉమ్మడి కడప జిల్లా చిట్వేలి మండలంలో అరటి, బొప్పాయి పంటలకు అకాల వర్షాలు, వడగండ్ల వాన వల్ల అపారమైన నష్టం కలిగిన రైతులను జనసేన పార్టీ నాయకులు పరామర్శించి నష్టం వివరాలు తెలుసుకున్నారు. ఇప్పటికీ ఎవరూ ఏ అధికారి మా వద్దకు రాలేదని కన్నీటి పర్యంతమయ్యారు. చేతికందిన అరతితోటలు కూలి పోవడంతో దిక్కుతోచని స్థితిలో రైతులు ఉన్నారు. ప్రభుత్వం మాకు మళ్ళీ పంట వేసుకోవడానికి అండగా నిలబడాలని,పంట నష్టం చెల్లించాలని వేడుకున్నారు.. జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్ర గారు మాట్లాడుతూ అసలు అసెంబ్లీలో ప్రధానంగా ఇప్పుడు చర్చించాల్సిన అంశాలు ఏమైనా ఉన్నాయి అంటే పార్టీలకు అతీతంగా అందరూ కలిసి ఉన్న ఎమ్మెల్యే లందరూ కూడా ఈ అకాల వర్షం వల్ల అపారంగా నష్టపోయినటువంటి మామిడి, బొప్పాయి, రకరకాల పంట రైతులను వాళ్లను ఏ విధంగా ఆదుకోవాలన్నారు. మన అధికారుల చేత ఎంత నష్టం వచ్చింది అని అంచనా వేయించాలి వాటి మీద చర్చ జరగాలి అసెంబ్లీలో కనీసం వీటి ప్రస్తావన కూడా తీసుకొని రాకపోవడం శోచనీయం అన్నారు.. వెంటనే అధికారులను ఉద్దేశించి కనీసం మరో పంటని వాళ్లని వేసుకోవడానికి ప్రభుత్వం అండగా నిలబడాలని ఆయన అన్నారు. ఈ పర్యటనలో రైతు సుంకర శ్రీనివాస్, భాకరాపురం కొత్తపల్లి, మరాటపల్లి రైతు పందికాళ్ల శంకరయ్య, తిమ్మయ్య గారిపల్లి కాటూరి లక్ష్మి నరసయ్య, కొమ్మి శ్రీను తదితరుల తోటలు సందర్శించారు. ఈ కార్యక్రమంలో మాదాసు నరసింహ పగడాల వెంకటేష్, అంకీ శెట్టి మణి, పగడాల శివ కంచర్ల సుధీర్ రెడ్డి, మాదాసు శివ, షేక్ రియాజ్, ఆనందాల తేజ, తుపాకుల పెంచలయ్య,పురం గిరి, సువ్వారపు హరి, పసలశివ, నీలికృష్ణ, మాదినేని హరి, నాగిసెట్టి శివ,తదితరులు పాల్గొన్నారు.