ధర్మవరం ( జనస్వరం ) : జనసేనపార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి తన స్వగృహంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. మీడియా ముఖంగా మాట్లాడుతూ గత 3 రోజుల నుంచి కురిసిన అకాల వర్షం వల్ల ప్రకృతి విపత్తు ద్వారా నష్టపోయిన అన్నదాతలను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని పాడైపోయిన అరటిపంట రైతులు తీవ్రంగా నష్టపోవడంతో వందల ఎకరాల్లో చేతికి వచ్చిన పంట పూర్తిగా నేల పాలవడంతో రైతుల తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి దెబ్బతిన్న పంట పొలాలను అధికారులు పరిశీలించాలని కోరారు. నష్టపోయిన ప్రతి రైతులకి ఒక్కో ఎకరానికి 2 లక్షల రూపాయలు చొప్పున అలాగే వరి, మొక్కజొన్న రైతులకు 50 వేల రూపాయలు చొప్పున మామిడి పంటల రైతులకు తగిన మొత్తంలో ఈ ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని లేనిపక్షంలో జనసేన పార్టీ తరపున పోరాటం చేస్తామని తెలియజేశారు.