గుంతకల్ ( జనస్వరం ) : వాల్తేరు వీరయ్య చిత్రం 50 రోజుల సందర్భంగా చిరంజీవి ఆధ్వర్యంలో కెపిఎస్ థియేటర్ నందు మెగా అభిమానులు ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అనంతపురం జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి వాసగిరి మణికంఠ, బిజెపి నాయకురాలు శ్రీదేవి, థియేటర్ యాజమాన్యం మల్లికార్జున, ఖాజా మొయిద్దీన్, జనసేన పట్టణ కన్వీనర్ బండి శేఖర్ సీనియర్ మెగా అభిమానులు పూల ఎర్రిస్వామి, రవి, రాయదుర్గం హరి మరియు చిరంజీవి యువత రాష్ట్ర కార్యదర్శి గోపి, పట్టణ అధ్యక్షుడు పాండు కుమార్ అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ పద్మభూషణ్ డాక్టర్ మెగాస్టార్ చిరంజీవి గారు నటనలోనూ మరియు సేవా దృక్పథం లోను కోట్లాది మందికి అభిమానులకు స్ఫూర్తిదాయకమని అంతేకాకుండా రక్తదానం అంటే చిరంజీవి – చిరంజీవి అంటే అంటే రక్తదానం అనే విధంగా యువతకు స్ఫూర్తినింపి కొన్ని లక్షల యూనిట్లో రక్తదానం చేయడానికి కారుకులైన మహానుభావుడని, కరోనా విపత్కర పరిస్థితుల్లో కూడా చిరంజీవి ఉచిత ఆక్సిజన్ బ్యాంకు ను నెలకొల్పి వేల మందికి ప్రాణవాయువు అందించిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. కంప్యూటర్ యుగంలో కూడా 50 రోజుల సినిమా ఫంక్షన్స్ జరుగుతున్నాయంటే అది ఒక చిరంజీవి గారి అద్భుతమైన నటనకు ప్రేక్షకుల నీరాజనాలే కారణమని వక్తలు వ్యాఖ్యానించారు. తదనంతరం అభిమానులు భారీ కేకును కట్ చేసి, అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పామయ్య, మంజునాథ్, బద్రి, అమర్నాథ్, అల్లు రవి, అల్లు అనిల్, ఆటో రామకృష్ణ, ఆటో కృష్ణ, రామకృష్ణ, నాసిర్, చిన్న చెర్రీ, యస్వంత్ చెర్రీ, పవన్ చెర్రీ, పరమేష్, మధు, ఆటో బాషా, సూరి, అల్లు సింబు, నజీర్, అల్లు హరీష్, చక్రవర్తి & థియేటర్ సిబ్బంది మెగా అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేశారు.