పచారి సరుకుల కాంట్రాక్టర్ పై అంత ప్రేమ ఎందుకు : పోతిన వెంకట మహేష్

పోతిన వెంకట మహేష్

    విజయవాడ ( జనస్వరం ) : జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, విజయవాడ నగర అధ్యక్షులు మరియు పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జి పోతిన వెంకట మహేష్ తన కార్యాలయం నుంచి విడుదల చేసిన వీడియోలో మాట్లాడుతూ పచారీ సరుకుల టెండర్ విషయంలో దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ ఆదేశాలను బేఖాతరు చేసి చెత్త బుట్టలో వేసిన దేవాదాయ కమిషనర్ హరి జవహర్ లాల్ గారు.10 కోట్ల రూపాయలు నిబంధన మార్చకుండా పచారీ సరుకుల టెండర్ ను మూడు విభాగాలుగా చేయకుండా అవే టెండర్లు ను కొనసాగించి టెండర్లను ఖరారు చేసి రివర్స్ టెండర్రింగ్ ప్రొసీజర్ ను మొదలుపెట్టిన శ్రీశైలం దేవస్థానం ద్వారకా తిరుమల దేవస్థానలని,పచారీ సరుకుల కాంట్రాక్టర్ మణికంఠ ఎంటర్ప్రైజెస్ పై ఎండోమెంట్ శాఖ ఉన్నత అధికారులకు అంత ప్రేమ ఎందుకని, మేము విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి కాంట్రాక్టర్లు అక్రమాలు గురించి ప్రశ్నిస్తే దానికి స్పందించిన నిబంధనలు మారుస్తామని కొట్టు సత్యనారాయణ విలేకరుల సమావేశంలో చెప్పారని, అయినా కూడా దేవాదాయ శాఖ అధికారులు మంత్రి కొట్టు సత్యనారాయణ మాట బేఖాతరు చేశారని, మంత్రి కొట్టు సత్యనారాయణ ఉత్సవ విగ్రహమా లేక మాజీ దేవాదాయ శాఖ మంత్రి మాటలే ఇంకా ఆ శాఖలో చెల్లుబాటు అవుతున్నాయా సీఎం గారు సమాధానం చెప్పాలని,గత ఏడాది హరి జవహర్ లాల్ గారు ఆవు నెయ్య టెండర్ విషయంలో నాణ్యతా ప్రమాణం పాటిస్తూ తక్కువ ధరకు టెండర్ వేయాలని సర్కులర్ జారీ చేశారని, మరి 500 నుంచి 600 కోట్ల రూపాయలు విలువైన పచారీ సరుకుల టెండర్ విషయంలో ఇలాంటి సర్కులర్ ఎందుకు జారీ చేయలేదో సమాధానం చెప్పాలని,పచారీ సరుకుల కాంట్రాక్టర్ వద్ద నుంచి కమిషనర్ గారు పెద్ద ఎత్తున ముడుపులు తీసుకున్నారేమో అని అనుమానం వస్తుందని, ఇప్పటికే ఈ విషయంపై స్పందనలో మేము వినతి పత్రం ఇచ్చామని,స్పందించకపోతే హైకోర్టుకు వెళ్లిన పోరాడుతామని హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way