– పశ్చిమ నియోజకవర్గం లో జనసేన పార్టీని, పోతిన మహేష్ ని చూస్తే అధికార వైసీపీకి భయం పట్టుకుంది.
– వారం రోజులుగా జరుగుతున్న పరిణామాలను చూసి అన్ని విషయాలలో భంగపడ్డ వెల్లంపల్లి శ్రీనివాస్ తట్టుకోలేక మా బ్యానర్లు తొలగించారు
– ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్న మాపై కక్షసాధింపు చెయ్యాలని చూస్తున్నారు
– మాది గాంధేయ మార్గం.. మళ్ళీ బ్యానర్లు కడతాం
విజయవాడ ( జనస్వరం ) : జనసేన పార్టీ పశ్చిమ నియోజకవర్గ కార్యాలయం వద్ద నిర్వహించిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర అధికార ప్రతినిధి విజయవాడ నగర అధ్యక్షులు, పశ్చిమ నియోజకవర్గం ఇన్చార్జ్ పోతిన వెంకట మహేష్ మాట్లాడుతూ అర్థరాత్రి పూట కుట్రపూరితంగా బ్యానర్లు తొలగించడం హేయమైన చర్య అని, పశ్చిమ నియోజకవర్గం లో జనసేన పార్టీని, పోతిన మహేష్ ని చూస్తే అధికార పార్టీకి భయం పట్టుకుందని, తెల్లవారుజామున 3.45, 4.15 మధ్య 100కు పైగా పోలీసులు, 30 మందికి పైగా వీ.ఏం.సీ సిబ్బంది వచ్చి బ్యానర్ లు తొలగించాల్సిన అవసరం ఎంటి? అని, మా కార్యాలయం దగ్గర బ్యానర్లు, హోర్డింగులు కట్టుకుంటే ఎందుకు తొలగించారో సిపి సమాధానం చెప్పాలని, ప్రజా సమస్యలు పై పోరాటం చేస్తున్న మాపై కక్షసాధింపు చేయాలని చూస్తున్నారని, ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ జనసేనను పోతిన మహేష్ ని చూసి భయపడుతున్నారని, నగర వ్యాప్తంగా అక్రమ నిర్మాణాలు తొలగించడం చేతకాదని, జనసేన పార్టీ పశ్చిమ కార్యాలయం వద్ద బ్యానర్లు తొలగించడానికి మాత్రం అధికారులకు తీరిక సమయం దొరికిందని ? అక్రమ నిర్మాణాలను అడ్డుకోవాలని, అక్రమ నిర్మాణాలను కూల్చాలని, కార్పొరేషన్ కి ఆదాయాన్ని పెంచి నగరాభివృద్ధికి తోడ్పడాలి కానీ జనసేన పార్టీ బ్యానర్లు తొలగించడానికి అధికారులకు అత్యుత్సాహం ఎందుకని, అర్ధరాత్రి పూట అంత హైడ్రామా నడపడానికి కారణాలేంటో చెప్పాలని, రాష్ట్ర వ్యాప్తంగా ప్రధాన ఆలయాలలో టెండర్లలో సుమారు 600 కోట్లు అవినీతి జరిగిందని చెప్పగానే టెండర్ల రూల్స్ మార్చారని, కాపు సామాజిక మంత్రికి అగౌరవం జరిగిన సంగతి బయటపెట్టానని, వారం రోజులుగా జరుగుతున్న పరిణామాలను చూసి అన్ని విషయాలలో భంగపడ్డ వెల్లంపల్లి శ్రీనివాస్ తట్టుకోలేక బ్యానర్లు తొలగించాలని అధికారులను పంపించారని, ఇలాంటి చర్యలకు మేము బయపడమని, ఇక్కడ పాగా వేసేది జనసేన పార్టీ తరపున పోతిన మహేష్ నని అందులో సందేహంమే లేదని, పోలీసులు బాధ్యతలు విధులు ఏంటో అవి నిర్వర్తించాలని గంజాయిని నియంత్రించాలని, విజయవాడ నగరంలో ఎక్కడపడితే అక్కడ గంజాయి దొరుకుతుందని, దానిపైన అర్ధరాత్రులు రైడింగ్ లు చేయాలని, మహిళల పైన దాడులు అధికంగా జరుగుతున్నాయని అవి నియంత్రి నియంత్రించాలని, సీతానగరంలో జరిగిన ఘటనలో ఏ1వెంకట రెడ్డిని ఇప్పటివరకు అరెస్టు చేయలేకపోయారనీ, బ్లేడ్ బ్యాచ్ వేరంగాలను ఆపలేకపోయారని, అస్లాం లాంటి కేసులను కూడా విచారించలేకపోయారని, నేను మొదటి నుంచి చెప్పినట్టే అస్లాం హత్య అని చివరికి రుజువైందని, అధికారులు చేయాల్సిన పనులు వదిలేసి అర్ధరాత్రి పూట్ల జనసేన పార్టీ కార్యాలయం పైన దాడులు చేయడం ఏంటని? గంజాయి బ్యాచిలను, బ్లేడ్ బ్యాచ్ లను, దొంగల్ని వదిలేసి, ప్రజా సమస్యల పైన పోరాడుతున్న మా మీద,మా కార్యాలయాలు పై అర్ధరాత్రి పూట ఈ విధంగా ప్రవర్తిస్తారా అని? దీనికి విజయవాడ నగర సిపి సమాధానం చెప్పి తీరాలని, విజయవాడ మున్సిపల్ కమిషనర్ అక్రమ నిర్మాణాలు ఎక్కడైనా నిరోధించారా అని, ఆఖరికి హైకోర్టుకు వెళ్లి సమాధానం చెప్పుకునే పరిస్థితి వచ్చిందని, నగరంలో చిన్నపాటి వర్షానికి ముంపుకు గురవుతున్న ప్రాంతాల సమస్యను పరిష్కరించ లేకపోయారని, ఏదో మా బ్యానర్లు తొలగించి ఏదో పెద్ద ఘన విజయం సాధించినట్టు అనుకుంటే ప్రజలు చూస్తూ ఊరుకోరని, రాబోయే రోజుల్లో ప్రజా సమస్యల పైన చాలా బలంగా స్పందిస్తామని, కార్పొరేషన్ అధికారులు కళ్ళు తెరిపిస్తామని, ప్రజలకి మీ ద్వారా సమాధానం చెప్పిస్తామని, బాధ్యతలు ఏంటో మీరు చేయాల్సిన విధులు ఏంటో మా ద్వారా చెప్పించుకోవద్దని, కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నామని, మేము చేసే ప్రతి పోరాటంలో న్యాయం ధర్మం ఉండబట్టే ప్రతిసారి వైసీపీ, ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ మా చేతిలో ప్రతిసారి ఓడిపోతున్నారని మా పోరాటాలకు మీరు తల వంచాల్సి వచ్చిందని, రాబోయే రోజుల్లో విజయవాడలో వైసిపి అడ్రస్ ఉండదని, మా మీద అక్రమంగా కేసులు కుట్రలు కుతంత్రాలు చేస్తున్న వారిపై కచ్చితంగా వారి అక్రమాలు బయటపెట్టి కేసులు పెట్టి వారిని ఊసాలు లెక్కపెట్టేలాగా చేస్తామని, మాది గాంధేయ మార్గం.. మళ్ళీ బ్యానర్లు కడతామన్నారు.