• 7 ప్రధాన దేవాలయాలలో 500 నుంచి 600 కోట్ల రూపాయల పచారి సరుకులు కాంట్రాక్టర్లు దోపిడి
• జగన్ గారి ప్రభుత్వం హిందూ దేవాలయాలను దోచుకుంటుంది
• దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, దేవాదాయ శాఖ అధికారులు కనుసన్నుల్లోనే ఈ అక్రమాలు జరుగుతున్నాయి
• 7 ప్రధాన దేవాలయాలకు కేవలం ఇద్దరు కాంట్రాక్టర్ 1 మణికంఠ, 2. రాజేష్ – రూపేష్ సంస్థలు
• యేడాది కి 125-150కోట్లు ఈ కాంట్రాక్టర్లు రిటైల్ రేటు పై 25 శాతం లాభాలు వేసుకుని కొట్టేస్తున్నారు
• ఇంత అవినీతి, దోపిడీ జరుగుతుంటే నిఘా విభాగం ఏం చేస్తుంది?
• ఆలయాల్లో జరుగుతున్న కుంభకోణాలపై స్వామిజీలు స్పందించాలి ysrcp ప్రభుత్వాన్ని నిలదీయాలి.
విజయవాడ ( జనస్వరం ) : జనసేన పార్టీ పశ్చిమ నియోజకవర్గ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర అధికార ప్రతినిధి విజయవాడ నగర అధ్యక్షులు మరియు పశ్చిమ నియోజకవర్గం ఇన్చార్జ్ పోతిన వెంకట మహేష్ మాట్లాడుతూ రాష్ట్రం లో ఏడు ప్రధాన ఆలయాల్లో పచారీ సరుకుల కాంట్రాక్టు లో ఐదు వందల నుంచి ఆరువందల కోట్ల దోపిడీ జరుగుతుందని, cm జగన్ గారు మీ పాలనలో హిందు దేవాలయాలను కాంట్రాక్టర్లు నిబంధనలు మార్చి యథేచ్ఛగా దోచుకుంటున్నారని, మంత్రి కొట్టు సత్యనారాయణ గారు దేవాదాయ శాఖ ముఖ్య అధికారులు కమిషన్లు తీసుకొని కాంట్రాక్టర్ లకు హిందు దేవుళ్ళ సొమ్మును దోచిపెడుతున్నారని, వైసిపి నాయకులు, దేవాదాయ శాఖ మంత్రి కనుసన్నల్లో ఈ అక్రమాలు చేస్తున్నారని, జగన్ ప్రోత్సాహం లేకుండా ఈ దోపిడీ సాధ్యమా? అని, ఆరు వందల కోట్లకుంభకోణం చేశారంటే వైసిపి పేద్దల సహకారం ఉందని, 2016 లో అప్పటి కమిషనర్ అనురాధ గారు జారీచేసిన ఒక సర్కులర్ (GO కాదని) 10 కోట్ల రూపాయల టర్నోవర్ నిబంధనను అడ్డం పెట్టుకొని పచారి సరుకుల కాంట్రాక్టర్లు 500 నుంచి 600 కోట్ల రూపాయల ఏడాదికి సరఫరా చేస్తున్నారని, వైసిపి కాంట్రాక్టర్లు కు దోచి పెట్టడానికి పది కోట్ల టర్నోవర్ నిబంధన తెచ్చారని, గతంలో ఐదు కోట్ల నిబంధనను ఎందుకు మార్చారని, 500 నుంచి 600 కోట్ల పచారీ సరుకులు సరఫరా చేసేది 7 ప్రధాన దేవాలయాలకు కేవలం ఇద్దరు కాంట్రాక్టర్ మాత్రమేనని, వారిలో ఒకరు రాయలసీమ ప్రాంతానికి చెందిన రాజేష్, రూపేష్ చెందిన సంస్థలు, రెండవది కృష్ణ – గోదావరి లకు చెందిన మణికంఠ ఎంటర్ప్రైజెస్ అని, ఈ ఇద్దరు కాంట్రాక్టర్లు కోసం నిబంధనలు మార్చింది వాస్తవమని, హోల్ సేల్ రేట్లకు కాకుండా రిటైల్ రేటు పై 25 శాతం లాభాలు వేసుకుని సరుకులు సరఫరా చేస్తున్నారని, ఒక యేడాది కి 125-150కోట్లు ఈ కాంట్రాక్టర్లు కొట్టేస్తున్నారని, ఇదంతా జగన్ గారి ఆదేశాలతో దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ ప్రోత్సహిస్తున్నారని, రివర్స్ టెండరింగ్ కూడా పెద్ద బూటకం అది పేరుకేనని, గతంలో విజయవాడ అమ్మవారి ఆలయంలో కూరగాయల కాంట్రాక్టు విషయంలో విజయవాడ రైతు బజార్ రేట్లకు టెండర్లు పిలిచారు దీనిపై కమిషన్ కార్యాలయం ఎంక్వయిరీ చేసి రైతు బజార్ రేట్ల కన్నా 15% తక్కువ ఉండేలాగా కాంట్రాక్ట్ లను ఖరారు చేశారని, ఈ కాంట్రాక్టు నెలకు కేవలం మూడు లక్షలు అని, మరి ఇప్పుడు పచారీ సరుకుల కాంట్రాక్టు విషయంలో ఈ విధంగా ఎందుకు ఎంక్వయిరీ చెయ్యకుండా నిబంధనలకు వ్యతిరేకంగా టెండర్ల ఖరారు చేస్తున్నారో మంత్రి కొట్టు సత్యనారాయణ గారు సమాధానం చెప్పాలని, ఏడు ప్రధాన దేవాలయాల్లో పచారీ సరుకుల రేట్ల సరఫరా విషయంలో పెద్ద ఎత్తున వ్యత్యాసం ఉందని, ఈ ముగ్గురు ప్రధాన కాంట్రాక్టర్లు సరఫరా చేసే సరుకులు నాణ్యతలేనివేనని, సరుకులు దిగుమతి చేసుకునే టైంలో అక్కడికి ఎవ్వరూ క్వాలిటీ టెస్టింగ్ చేయరని, విజిలెన్స్ అండ్ ఫోర్స్ మెంట్ అసలు కళ్ళు మూసుకొని పని చేస్తుందని, వాళ్ల నిఘానేత్రం మూసుకుపోయిందని, క్వాలిటీస్ టెస్టింగ్ సర్టిఫికెట్ కూడా సదర్ కాంట్రాక్టర్లే తెచ్చి ఆలయంలో ఇచ్చేస్తారని, అన్నవరం, సింహాచలం, ద్వారకా తిరుమల, దుర్గగుడి కి ఒకే కాంట్రాక్టర్ వేర్వేరు ధరలతో 75 రకాల సరుకులు ఇస్తున్నారాని, అధికారులు కళ్లు మూసుకుని పని చేస్తున్నారని, భక్తులు ఆలయాలకు ఇచ్చే కానుకలు, డబ్బులను ఇటువంటి కాంట్రాక్టర్లు కు దోచి పెడతారఅని ? వందల కోట్లు కొట్టేస్తే అలయాల అభివృద్ధి ఎలా చేస్తారని, స్వామిజీలు కూడా ఆలయాల్లో జరుగుతున్న కుంభకోణాలపై స్పందించి సిఎం జగన్ గారి ప్రభుత్వాన్ని నిలదీయాలని, ఇకనుంచి అయినా అనుమతి ఇచ్చే ఈ కాంట్రాక్టు వ్యవస్థ ను మార్చాలని, 75రకాల సరుకులను పది మందికి ఇచ్చేలా నిబంధనలు మార్చాలని, ప్రభుత్వం స్పందించకుంటే జనసేన ఉద్యమిస్తామని అన్నారు. ఈ సమావేశంలో అమ్మవారి ధార్మిక సేవ మండలి సభ్యులు శానంపూడి శిరీష, తమ్మిన రఘు, కార్మికొండ శివరామకృష్ణ మరియు నాయకులు పులి చేరి రమేష్, అగ్రహారపు రాజు తదితరులు పాల్గొన్నారు.