ఏలూరు, (జనస్వరం) : కృష్ణాజిల్లా గన్నవరం టిడిపి కార్యాలయంపై వైసీపీ గూండాల దాడి అప్రజాస్వామికమని ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాల జనసేన పార్టీ అధికార ప్రతినిధి రెడ్డి అప్పలనాయుడు ఖండించారు. నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ప్రజలు ప్రజాస్వామ్య పరిపాలనలో ఉన్నారా? లేక గుండాల పరిపాలనలో ఉన్నారా?గన్నవరం టిడిపి కార్యాలయంపై, వైసిపి గుండాల దాడి ప్రస్ఫుటం చేస్తోందన్నారు. పార్టీ కార్యాలయం అంటే, దేవాలయం లాంటిదని ఒక అసెంబ్లీ, ఓ పార్లమెంట్ భవనం లాంటిదని, ఇటువంటి పార్టీ కార్యాలయాలపై దాడులకు ఎగబడి, కార్యాలయాలను, అక్కడున్న వాహనాలను తగులబెట్టి, పార్టీ కార్య కర్తలపై దాడులకు ఎగబడి,ప్రజలను భయభ్రాంతులకు గురిచేసే విధంగా జగన్మోహన్ రెడ్డి పరిపాలన కొనసాగిస్తున్నారు అన్నారు. మాకే ఓటేయాలి, మా పార్టీ జెండాని పట్టుకోవాలని, రాష్ట్రంలో ఉన్న పౌరులను భయకంపితులను చేస్తున్నారన్నారు. ప్రజాస్వామ్యాన్ని తుంగలోకి తొక్కి, న్యాయ వ్యవస్థను లెక్కచేయకుండా, నేను చేసిందే చట్టం, నేను రాసిన రాజ్యాంగమే అమలు కావాలి అని, పోలీసు వ్యవస్థను తమ చెప్పు చేతల్లో పెట్టుకొని, ఇష్టరీతిగా దాడులు చేస్తూ ఈ రాష్ట్రాన్ని ఎటువైపు తీసుకు వెళుతున్నాడని ప్రజలు గమనిస్తున్నారన్నారు. దాడి జరిగిన ప్రాంతాన్ని రాష్ట్ర డిజిపి పరిశీలించి గన్నవరం టిడిపి కార్యాలయంపై దాడికి గుండాలను ప్రోత్సహించిన వైసీపీ నాయకుల పైన, చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని, పోలీస్ యంత్రాంగాన్ని, ప్రభుత్వ యంత్రాంగాన్ని జనసేన ఏలూరు నియోజకవర్గ ఇన్చార్జి రెడ్డి అప్పలనాయుడు హెచ్చరించారు.