– సామాజిక న్యాయం అంటూ బీసీలను మోసం సీఎం చేస్తున్నారు
– సీఎం జగన్ ముమ్మాటికి బీసీల ద్రోహి
– జనసేనపార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, పశ్చిమ నియోజకర్గ ఇంఛార్జి, నగర అధ్యక్షుడు పోతిన మహేష్
విజయవాడ, (జనస్వరం) : మాతృభాషను రక్షించుకోవాల్సిన ఆవశ్యకత ఏపీ ప్రజలపై ఉందని జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, పశ్చిమ నియోజకర్గ ఇంఛార్జి, నగర అధ్యక్షుడు పోతిన మహేష్ అన్నారు. ఈ సందర్భంగా పశ్చిమ నియోజకవర్గంలో నిర్వహించిన మీడియా అయన మాట్లాడుతూ మాతృభాషను రక్షించుకోవాల్సిన ఆవశ్యకత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలపై ఉందని, సీఎం జగన్ పాలనలో ప్రజలను పక్కదారి పట్టిస్తూ మాతృభాష తెలుగు కు తెగులు పట్టించారని, ఎమ్మెల్సీలుగా 11 మందికి బీసీలకు పదవులు అంటూ మరొకసారి బీసీలను సామాజిక న్యాయం పేరిట మోసం చేస్తున్నది సీఎం జగన్ అని, శాసనమండలి ఎప్పుడైనా రద్దు అవుతుందని, శాసనమండలి రద్దు చేయాలని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపిన సీఎం జగన్ శాసన మండలిలో ఎమ్మెల్సీ స్థానాలను ఏ విధంగా భర్తీ చేస్తారని, రద్దు కాబోయే శాసన మండల్లో బీసీలకు ఇచ్చిన 11 ఎమ్మెల్సీ పదవులు తుమ్మితే ఊడిపోయే పదవులు లాంటివి, దీనివల్ల బీసీలకు ఒరిగే ప్రయోజనం ఏమీ లేదని, సామాజిక న్యాయం అంటూ బీసీలను మోసం చేస్తున్న సీఎం జగన్ ముమ్మాటికి బీసీల ద్రోహి అని, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 10 శాతం రిజర్వేషన్లు తగ్గించి 16,800 బీసీలు రాజ్యాంగబద్ధంగా పదవులు కోల్పోయేలా చేసిన సీఎం వైయస్ జగన్ ముమ్మాటికి బీసీల ద్రోహి అని, సీఎం జగన్ ప్రభుత్వంలో కుల చేతివృత్తులను ఏనాడై నా ఆదరించారా? అని పెళ్ళి కానుక పథకంలో అనేక నిబంధనలను చేర్చి బీసీ ఆడపిల్లలను మోసం చేసిన సీఎం జగన్ ని ఎద్దేవా చేశారు.