ఏలూరు, (జనస్వరం) : ఏలూరు నియోజకవర్గం 18 వ డివిజన్ వంగాయగూడెంలో ఉన్న పంట బోదెలోని పూడికను తొలగించాలని ఏలూరు జనసేనపార్టీ ఇంచార్జి రెడ్డి అప్పలనాయుడు డిమాండ్ చేశారు. ఆ ఏరియాను పరిశీలించిన ఆయన వెంటనే పూడికలను తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ కృష్ణ కెనాల్ నుండి బాపిస్టు వారి పేట, గొల్లాయగూడెం, వంగాయ గూడెం, సుబ్రహ్మణ్యం కాలనీ మీదుగా పోణంగికి వెళ్లే పంట బోదె ను మురికి బోదె మార్చేశారు. వైసిపి ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిశుభ్రత అనేది మూలన పడ్డాయి. ఈ పంట బోదె పూర్తిగా చెత్త వ్యర్థాలతో నిండిపోయింది. ప్రక్కనే ఉన్న నుయ్యి సైతం పాడైపోయింది. స్థానిక ఎమ్మెల్యే ఆళ్ల నానికి, మేయర్ కి కొత్తగా వచ్చిన కమిషనర్ కి సిబ్బందికి మీడియా రూపంలో ఈ విషయాన్ని తెలియజేస్తున్నాం. ఈ సమస్యకు తక్షణమే పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తున్నాం అని అన్నారు. మీరు పన్నులు వసూలు చేస్తున్నారు. కాలువలోని పూడికను తొలగించలేరా ? పరిసర ప్రాంతాల్లోకి వాసన రాకుండా చేయండి. మేము మీ దగ్గర నుండి వాటాలు అడగడం లేదని ప్రజా సమస్యను పరిష్కారం చేయమని మాత్రమే డిమాండ్ చేస్తున్నాం. మీ అధికారాన్ని మాకు ఇవ్వమని అడగడం లేదు. ఏదైతే సమస్య ఉన్నాయో ఆ సమస్యను పరిష్కారం చేయమని మాత్రమే అడుగుతున్నాం. ప్రజల వద్ద నుండి జీతాలు తీసుకుంటున్న అధికారులు, గౌరవ వేతనము తీసుకుంటున్న మేయర్, ప్రభుత్వ ధనంతో లక్షల్లో జీతాలు తీసుకుంటున్న ఎమ్మెల్యే మూడు దఫాలుగా ఏలూరు నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉండి ఏం చేశారని ప్రశ్నించారు. ఈ ఏరియాలో ఎస్సీలు, ఎస్టీలు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. వాళ్ళందరూ పేదవాళ్లు. పేదవాళ్లంటే మీకు లెక్క లేదా ? ఎస్సీ సామాజిక వర్గాలు నివాసం ఉండే ఏరియా ఇది. వీళ్ళు మురికి రూపంలోనే ఉండాలా ? దోమల మధ్యనే బతకాలా ? అని ప్రశ్నించారు. తక్షణమే ఈ సమస్యకు పరిష్కారం చేయాలని ఈనెల 20వ తేదీ వరకు మీకు గడువు ఇస్తున్నాం. లేని పక్షంలో 21వ తేదీ నుండి జనసేన పార్టీ తరఫున ఆ మురికి కాలువలోని వ్యర్ధాలను తొలగిస్తామని జనసేన పార్టీ నుండి హెచ్చరిస్తున్నాం. ఇప్పటికైనా మీకు చలనం ఉంటే బాధ్యత ఉంటే ప్రజల ఓటుతో గద్దెనెక్కిన మీరు కనీసం ప్రజల పక్షాన ఎప్పుడైనా నిలబడ్డారా ? మీకు నైతిక విలువలు అనేవి ఉన్నాయా ? ఇప్పటికైనా స్పందించాలని లేనిపక్షంలో ఈ విషయాన్ని పూర్తి సీరియస్ గా మేము తీసుకుంటామని జనసేన పార్టీ నుండి నిర్వహిస్తామని అదేవిధంగా ఏలూరులోనే కాకుండా రాష్ట్రంలో ఎక్కడైనా ఏ ఒక్క సమస్య ఉన్న గాని జనసేన పార్టీ పోరాటం చేస్తేనే అది ఆ సమస్యకు పరిష్కారం అవుతుందని ప్రజల పక్షాన పోరాటం చేసే ఏకైక పార్టీ జనసేనపార్టీ అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎమ్మెల్యే ఆళ్ళ నాని, మేయర్ నూర్జహాన్, కమిషనర్ ఈ డివిజన్లోని కార్పొరేటర్ మీరందరూ కూడా స్పందించి ఈ సమస్యను పరిష్కారం చేయాలని జనసేనపార్టీ నుండి డిమాండ్ చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు నగిరెడ్డి కాశీ నరేష్, ఉపాధ్యక్షులు గుబ్బల నాగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి సరిది రాజేష్,పల్లి విజయ్, అధికార ప్రతినిధి అల్లు సాయి చరణ్, కోశాధికారి పైడి లక్ష్మణరావు కార్యదర్శి కందుకూరి ఈశ్వరరావు, బుధ్ధా నాగేశ్వరరావు,నాయకులు వీరంకి పండు, బోండా రాము నాయుడు, తేజ, బి.సన్యాసిరావు, బాబి, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.