• 609 ఎకరాలు దోచేసిన శ్రీ అమర్నాథ్
• విస్సన్నపేట క్షేత్ర స్థాయి పరిశీలనలో వెలుగు చూసిన నిజాలు
విశాఖపట్నం ( జనస్వరం ) : కొండల్ని మాయం చేసేశారు.. గుట్టల్ని మింగేశారు.. అందినకాడికి ఆక్రమించేశారు.. అడితే బుకాయిస్తున్నారు.. మంత్రి అమర్నాథ్ భూ దందాపై జనసేన పార్టీ క్షేత్ర స్థాయి పరిశీలనలో వెలుగు చూసిన నిజాలు ఇవి. మంత్రి 600 ఎకరాల ప్రభుత్వ భూమిని కాజేశారు.. మా దగ్గర ఆధారాలు ఉన్నాయి.. మీ భూ దోపిడి బయటపెడతామంటూ జనసేన పార్టీ విశాఖ జిల్లా నాయకులు విసిరిన సవాలును మంత్రి అమర్నాథ్ స్వీకరించడానికి సిద్ధమని ప్రగల్భాలు పలికారు.. సవాళ్లు.. ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు అనకాపల్లి నియోజకవర్గం పరిధిలోని విస్సన్నపేట గ్రామానికి వెళ్లారు. ఛలో విస్సన్నపేట పేరిట నిర్వహించిన ఈ కార్యక్రమానికి జనసేన శ్రేణుల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. అంతా విస్సన్నపేట చేరుకుని మంత్రి ఆక్రమించిన అక్షరాలా 609 ఎకరాల భూమిని పరిశీలించారు. అక్కడ పరిస్థితులు చూసి ఆశ్చర్యచకితులయ్యారు. అధికార పార్టీ, మంత్రి అండదండలో అడ్డదిడ్డంగా అక్కడ చోటు చేసుకున్న పర్యావరణ విధ్వంసాన్ని వీడియోలు, ఫోటోలలో బంధించారు. వందల ఎకరాల్లో ఉన్న కొండల్ని మంత్రి కనుసనల్లో మింగేసిన వైనం జనసేన నేతలు నోరెళ్లబెట్టేలా చేసింది. ఓ మంత్రి కనుసనల్లో ఈ స్థాయిలో సాగుతున్న భూదందా ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని ఈ సందర్భంగా పార్టీ నేతలు దుయ్యబట్టారు. ఈ భూదందాకి కొండ మీద నిర్మించిన గెస్ట్ హౌస్, హెలీప్యాడ్ హైలెట్స్ గా నిలిచాయి. వీటిని పరిశీలించిన జనసేన నేతలు వైసీపీ దోపిడికి పరాకాష్టగా అభివర్ణించారు. ఆక్రమణకు గురైన కాలువలు, అసైన్డ్ భూములు, ప్రభుత్వ భూములను కూడా పరిశీలించారు. బలంవంతంగా భూములు లాక్కున్న బాధితుల నుంచి వివరాలు సేకరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ ప్రధాన కార్యదర్శలు టి. శివశంకర్, బొలిశెట్టి సత్య, పీఏసీ సభ్యులు కోన తాతారావు, అధికార ప్రతినిధులు సుందరపు విజయ్ కుమార్, పరుచూరి భాస్కరరావు, పార్టీ నాయకులు గడసాల అప్పారావు, పీవీఎస్ఎన్ రాజు, వంపూరి గంగులయ్య, సందీప్ పంచకర్ల, పసుపులేటి ఉషాకిరణ్ మరియు జిల్లా నాయకులు, తదితరులు పాల్గొన్నారు.