• పవనన్న ప్రజాబాటలో జనసేనపార్టీ నేత కేతంరెడ్డి వినోద్ రెడ్డి
నెల్లూరు, (జనస్వరం) : నెల్లూరు సిటీ నియోజకవర్గంలో జనసేనపార్టీ నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్విరామంగా, నిరాటంకంగా జరుగుతున్న పవనన్న ప్రజాబాట కార్యక్రమం 267వ రోజున 54వ డివిజన్ వెంకటేశ్వరపురం జనార్ధన్ రెడ్డి కాలనీ ప్రాంతంలో జరగింది. ఇక్కడ ప్రతి ఇంటికీ వెళ్ళిన కేతంరెడ్డి ప్రజల సమస్యలను అధ్యయనం చేసి అండగా నిలబడతామని భరోసా కల్పించారు. ఈ సందర్భంగా కేతంరెడ్డి వినోద్ రెడ్డి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో వివిధ ప్రభుత్వ పనులు చేపట్టే చిన్నాచితకా కాంట్రాక్టర్లు, సబ్ కాంట్రాక్టర్లు విపరీతమైన ఆర్థిక కష్టాల్లోకి వెళ్ళిపోయి ఒత్తిడికి లోనవుతున్నారని అన్నారు. ప్రభుత్వం నుండి బిల్లులు వస్తాయి కదా అప్పుసొప్పులు చేసి పలు పనులు చేసిన వారికి నేటికీ బిల్లులు రాకపోవడంతో, ఇంక మిగిలి ఉన్న ఈ ప్రభుత్వ కాలంలో వస్తాయన్న నమ్మకం లేకపోవడంతో వారంతా తీవ్ర ఆందోళనలో ఉన్నారని అన్నారు. పవనన్న ప్రజాబాటలో తనకు ఎదురైన ఓ సంఘటనని గుర్తు చేసుకుంటూ వైసీపీ కార్యకర్తగా ఉండే వ్యక్తి ఈ ప్రభుత్వం తమదే కదా అని నమ్మి కాంట్రాక్టు పని చేస్తే 30 లక్షల రూపాయల వరకు బిల్లు ఆగిపోయి ఉందని, చేసిన అప్పులు తీర్చేందుకు ఇంట్లో ఆడవారి తాళిబొట్టుతో సహా దాచుకున్న బంగారాన్ని తాకట్టు పెట్టాల్సి వచ్చిందని వాపోయారన్నారు. ఇలా ఎంతో మంది ఆర్థికంగా కుదేలై తమ బాధలు బయటకు చెప్పుకోలేక ఈ ప్రభుత్వంలో నరకయాతన అనుభవిస్తున్నారని కేతంరెడ్డి వినోద్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక జనసేనపార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.