ఏలూరు, (జనస్వరం) : చాలీచాలని కూలితో డొక్కాడని కార్మికుల ఆవేదన. అర్హులైనా సంక్షేమానికి దూరమైన పేదల ఆక్రందన. ఉద్యోగాలు రాక జీవితాల్ని కోల్పోతున్నామని వేదనకు గురవుతున్న యువత. ఇలా పలు వర్గాల సమస్యల్ని సావధానంగా ఆలకిస్తూ.. భవిష్యత్తులో అందరికీ న్యాయం చేస్తామని ధైర్యాన్నిస్తూ.. ప్రజల అడుగులో అడుగులేస్తూ ప్రజా సమస్యలపై పోరుబాట కార్యక్రమాన్ని మంగళవారం జనసేనపార్టీ ఏలూరు నియోజకవర్గ ఇంచార్జీ రెడ్డి అప్పలనాయుడు 14వ డివిజన్ గడియార స్తంభం నుండి ప్రారంభించారు. పోరుబాటను చైతన్యయాత్రగా మలిచారు. ఏలూరు నగర వీధుల్లో ఆద్యంతం అప్పలనాయుడుకు అపూర్వ స్వాగతం లభించింది. అభిమానులు పలుచోట్ల పెద్ద ఎత్తున పూల వర్షం కురిపించారు. గజమాలతో సత్కరించారు. విద్యార్థుల కేరింతలు పోరుబాటకు మరింత ఉత్సాహాన్ని నింపాయి. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ సిరిపల్లి ప్రసాద్, జిల్లా ఉపాధ్యక్షులు ఇళ్ల శ్రీనివాస్, నగర అధ్యక్షులు నగిరెడ్డి కాశీ నరేష్, ఉపాధ్యక్షులు సుందరనీడు ప్రసాద్, ప్రధాన కార్యదర్శి సరిది రాజేష్, కార్యదర్శులు కే.సరళ, ఎట్రించి ధర్మేంద్ర, బుద్ద నాగేశ్వరావు, బుదిరెడ్డి బలరాం, కూనిశెట్టి మురళి, పవన్, మహిళా కార్యదర్శి దుర్గ బి, ప్రియా రాణి,మేకా సాయి, దుర్గ, పొన్నూరు రాము,గెడ్డం చైతన్య, నాగేశ్వరరావు, దోసపర్తి రాజు, ప్రమీల రాణి, కోశాధికారి పైడి లక్ష్మణ రావు, చిత్తరి శివ, జనసేన అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు.