ఏలూరు, (జనస్వరం) : ప్రజా సమస్యలపై జనసేన పోరుబాటలో భాగంగా సోమవారం 37 వ రోజు పాదయాత్ర ఏలూరు నగరపాలక సంస్థ పరిధిలోని 3,4వ డివిజన్ పరిధిలో ఉన్న యేసుపాదపురం, కనకదుర్గమ్మ గుడి దగ్గర నుండి నవాబు పేట, న్యూకాలనీ ఏరియాలో రెడ్డి అప్పల నాయుడు పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ ఏలూరు నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల నాని వివక్షత చూపుతున్నారని, అట్టహాసంగా పేద ప్రజలకు అండగా ఉన్నామని అబద్ధాలు చెబుతు ప్రజలను మభ్యపెడుతున్నారని ఆరోపించారు. జగనన్న కాలనీలో ఇళ్ల నిర్మాణ పనులు స్తంభించిపోయాయని,కార్మికులకు పనిలేక అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారని, ఏలూరులో ఉన్న ఒకే ఒక పరిశ్రమ జూట్ మిల్ కూడా మూతపడిపోయిందని, వేలాదిమంది కార్మికులు రోడ్డును పడ్డారని కార్మికుల సమస్యలను పక్కనపెట్టి, గడపగడపకు కార్యక్రమంలో గొప్పలు చెప్పుకుంటున్నారని, ఎద్దేవా చేశారు. రాజ్యాంగబద్ధంగా ప్రజలకు సంక్రమించిన ఓటు హక్కుపై ప్రజలను చైతన్యపరచి రానున్న ఎన్నికల్లో ప్రజా సమస్యలను వారికి ఓటు వేసే విధంగా ప్రజలను చైతన్యవంతం చేయడమే జనసేనపార్టీ లక్ష్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏలూరు ప.గో.జిల్లా కార్యదర్శి కస్తూరి సాయి తేజస్విని, మాజీ డిప్యూటీ మేయర్ జనసేన నాయకులు శిరిపల్లి శివరామకృష్ణ ప్రసాద్, నగర అధ్యక్షులు నగిరెడ్డి కాశి నరేష్, ఉపాధ్యక్షులు సుందరనీడి ప్రసాద్, ప్రధాన కార్యదర్శి సరిది రాజేష్, అధికార ప్రతినిధి అల్లు సాయి చరణ్, ఫ్యాన్స్ ప్రెసిడెంట్ దోసపర్తి రాజు కార్యదర్శిలు కందుకూరి ఈశ్వరరావు, కుర్మా సరళ, బొత్స మధు, ఎట్రించి ధర్మేంద్ర, బుడిరెడ్డి బలరాం, మజ్జి శ్రీను, బుద్దనాగేశ్వరావు, నగర కోశాధికారి పైడి లక్ష్మణరావు,1 టౌన్ మహిళ కార్యదర్శి ప్రమీల రాణి, సంయుక్త కార్యదర్శి దుర్గా బి, నాయకులు వీరంకి పండు, రెడ్డి గౌరీ శంకర్, బొండా రాము నాయుడు, నిమ్మల శ్రీనివాసరావు, పొన్నూరు రాము, రాజు, కె.శ్రీను, సింగ్, కె. శివ, వినోద్, బాలు, ఆనంద్, జనసేన కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.