గుడివాడ అమర్నాథ్ వ్యాఖ్యలు తీవ్రంగా ఖండించిన పెందుర్తి జనసేన నాయకులు వబ్బిన శ్రీకాంత్

      పెందుర్తి, (జనస్వరం) : పెందుర్తి నియోజకవర్గం, 88 వార్డ్, నరవ గ్రామంలో జనసేన పార్టీ వబ్బిన జనార్దన శ్రీకాంత్ గుడివాడ అమర్నాథ్ మాటలను తీవ్రంగా ఖండించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఒక కాపు కులంలో పుట్టడం వల్ల మంత్రి స్థానం వచ్చిందని మర్చిపోయి, కాపుల కోసం కట్టిన కళ్యాణ మండపం ప్రారంభోత్సవంలో ఆ సందర్భంగా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పై పిచ్చి ప్రాలాపన చేయడం జరిగిందని, గుడివాడ అమర్నాథ్ కాపు కులంలో పుట్టడం కాపులు చేసుకున్న దౌర్భాగ్యం అని తెలిపారు. గుడివాడ గురునాథరావు కి పుట్టడం వారి కుటుంబం చేసుకున్న దౌర్భాగ్యం అని మండిపడ్డారు. ఇలాంటి వ్యక్తులు ఈ భూమ్మీద పుట్టడం మనం చేసుకున్న దౌర్భాగ్యం. ఇటువంటి వ్యక్తులు ఒక కాపు కులంలోనే కాదు మరి ఏ కులంలోను పుట్టడానికి అర్హత లేదని, పవన్ కళ్యాణ్ పై మాట్లాడకపోతే ఈ మంత్రి పదవి పోతాదేమో అని భయంతో మాట్లాడడం జరుగుతుంది. నీ చరిత్ర తీసుకుంటే తెలుగుదేశం కార్పొరేటర్ గా అయ్యి పార్టీలు మార్చి  వైఎస్ఆర్సిపి పార్టీలో ఒక బానిస లాగా నువ్వు జీవనం సాగిస్తున్నావు అది మర్చిపోకూడదని, ఒక కాపు మంత్రి మాట్లాడుతున్నప్పుడు పక్కనున్న స్థానిక ఎమ్మెల్యే వేలమా కులానికి చెందిన అదీప్ రాజు నీ మాటలు చూసి హేళన చేసేలాగా ఉన్నాయి, తప్పకుండా పెందుర్తి నియోజకవర్గంలో ఉన్న కాపులతో పాటు మిగిలిన కులాలకు సంబంధించిన వ్యక్తులు కూడా నీ యొక్క మాటలను పరిగణన తీసుకొని రాబోయే రోజుల్లో వైఎస్ఆర్సిపికి గట్టి బుద్ధి చెప్తారని తెలిపారు. ప్రజలకు ఎటువంటి మౌలిక వసతులు వంటశాల, విద్యుత్, నీరు సదుపాయం, ప్రహరీ, పార్కింగ్ ఏర్పాటు చేయకుండా హడావుడిగా కాపు కళ్యాణ మండపాన్ని ప్రారంభోత్సవం చేసి ఆ సందర్భంగా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పై చెత్త ప్రలాపన చేసిన మంత్రివర్యలు మాటలును తీవ్రంగా ఖండిస్తున్నామని, నీలాంటి వ్యక్తిని పుట్టించినందుకు భగవంతుడు సిగ్గుపడుతూ భవిష్యత్తులో ప్రజల ద్వారా మీయొక్క గతిని స్థితిని తప్పక మారుస్తారని హెచ్చరించడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way