
నెల్లూరు, (జనస్వరం) : గతంలో జనసేన పార్టీ సింబల్ ను, పవన్ కళ్యాణ్ ఫోటోను ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా జనసేన సైకిల్స్ ను మార్కెట్లోకి విడుదల చేసిన మాదవ్ వారాహి సైకిల్ వర్షన్ ను నెల్లూరులో విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దుష్ట శిక్షణకు అవతారవెత్తిన అమ్మ వారాహి పేరుతో రాష్ట్రంలో అరాచక శక్తులను రూపుమాపేందుకు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ వారాహి వాహనంపై బయలుదేరారు. అదే రంగులను ఉపయోగిస్తూ జనసేన పార్టీ సింబల్ గాజు గ్లాసు ని పవన్ కళ్యాణ్ ని సైకిల్ పై ముద్రిస్తూ వారాహి సైకిల్ వర్షన్ సుధా మాధవ్ లాంచ్ చేయటం సంతోషంగా ఉంది. జనసేన పార్టీ పైన ఉన్న నమ్మకాన్ని పవన్ కళ్యాణ్ అభిమానాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ఇలాంటి ప్రయోగం అభినందనీయం. ఎంతో వ్యయంతో కూడుకున్న పని దాదాపుగా ఒకసారి ఈ మోడల్ తయారు చేయాలంటే 500 సైకిళ్ళు పైగా ఆర్డర్ చేయాల్సి ఉంది. జనసేన మీద పవన్ కళ్యాణ్ మీద అభిమానంతో డబ్బు లెక్క చేయకుండా ఎటువంటి ఒత్తిళ్లకు తలొగ్గకుండా జనసేన ముందుకు తీసుకెళుతున్న వారికి శుధాభినందనలు. జనసైనికులు జనసేన మద్దతు దారులు అందరూ కూడా ఒకసారి సుబేదార్ పేట నందు గల వారి వారి సైకిల్ షాప్ కి ఇచ్చేసి వారిని ఆదరించాల్సిందిగా కోరుకుంటున్నానని తెలిపారు. నెల్లూరు సిటీ సుబేదార్ పేట నందు గల వారి సైకిల్ షాప్ నందు జరిగిన ఈ కార్యక్రమానికి గురుకుల కిషోర్ తో పాటు ప్రశాంత్ గౌడ్, అలేఖ్, కంధర్, హేమ చంద్ర యాదవ్, ప్రసన్న తదితరులు పాల్గొన్నారు.