
నెల్లూరు ( జనస్వరం ) : నెల్లూరు జనసేనపార్టీ ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ గత ఎనిమిది రోజులుగా జనసేన కార్యకర్తల ఆత్మీయ పలకరింపులో భాగంగా స్థానిక 29 వ డివిజన్ నందు ఖలీల్ బాయ్ ని కలిసి వారి కుటుంబ సభ్యుల మద్దతు కోరుతూ ఇరుగుపొరుగు వారిని జనసేనపార్టీకి ఓటు వేయాల్సిందిగా అభ్యర్థించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత సార్వత్రిక ఎన్నికలలో జనసేన పార్టీని ముందుండి నడిపిన గాంధీనగర్ వాసులకు అభినందనలు తెలిపారు. చెత్త సేకరించే బండ్లు రెండు వారాలకు ఒకసారి వస్తున్నాయి, డ్రైనేజి కాలవలు వ్యర్ధాలతో పొంగి పొర్లుతున్నాయి ప్రజాధనంతో నిర్మించిన పార్కు నిర్వహణ లోపంతో పాడుబడిపోతుంది. ఒక్కసారి ప్రభుత్వ పధకాలు ఎత్తి వేస్తే ఎన్ని అర్హత పత్రాలు చూపినా మళ్ళి తిరిగి ఇచ్చే పరిస్థితి లేదన్నారు. వైసిపి వైఫల్యాల గురైన ప్రజలు ఆలోచించి ఈసారి మూడవ ప్రత్యామ్యానికి అవకాశం ఇవ్వాలని జనసేనపార్టీ గాజు గ్లాసుకి అవకాశం ఇస్తే జనసేన నాయకులు అభివృద్ధి పథంలో నడిపించగలరని పవన్ కళ్యాణ్ ఆశయ సాధనకు పని చేసే మా నాయకులు ప్రజలకు సుపరిపాలన అందిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కిషోర్ తో పాటు ఖలీల్ భాయ్, నారాయణ, భాను, ఇంతియాజ్, ప్రశాంత్ గౌడ్, ప్రసన్న, హేమచంద్ర యాదవ్, అలేక్, మౌనిష్ తరుణ్ తదితరులు పాల్గొన్నారు.