చీపురుపల్లి ( జనస్వరం ) : ఈ రాష్ట్ర ప్రభుత్వం సుమారు 2600కోట్లు రూపాయలు ప్రజధనాన్ని వెచ్చించి భూములు రీ సర్వే చెయ్యడానికి పూనుకొంది. ఇప్పటికే సుమారు ఒక్క సంత్సరం కాలం గడుస్తున్నా ఇప్పటివరకు రైతులకు ఏవిధమైన ఫలితం లేకుండా పోయింది. భూములు రీసర్వే జరిగే గ్రామాల్లో డ్రోన్ సర్వే మాత్రమే చేసి భూములు రీసర్వే చేసినట్టు రైతులకు ఉపయోగం ఎదో జరిగినట్టు ఈ రాష్ట్ర ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటుందని చీపురుపల్లి జనసేన నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. వారు మాట్లాడుతూ ప్రభుత్వం సదరు భూములు రీసర్వే పారదర్శకంగా జరగటంలేదు భూములు రీసర్వే పూర్తి చేసిన గ్రామాల్లో రైతులకు ఎటువంటి మేలు జరగలేదన్నారు. రీసర్వేకి ముందు ఉండే సమస్యలు ఉత్పనం అవుతున్నాయి. సుమారు 2600కోట్ల రూపాయిలు ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాధ నాన్ని వృధా చేస్తుంది. ఇప్పటికైనా రైతులుకు మేలు చేసే ఈ భూములు రీసర్వే ఉపయోగం అయ్యేలా జనసేన పార్టీ తరుపున తుమ్మగంటి సూరినాయుడు, అడ్డాల రామచంద్ర రాజు, దమరసింగి ఆదినారాయన, సిగ తవిటినాయుడు, దనాన్న యేసు బాబు,సిగ రమణ, పాండ్రంకి రమణ, తదితరులు ఖండించారు.