చోడవరం నియోజకవర్గంలో పల్లె పల్లెకు జనసేన కార్యక్రమం

చోడవరం

            చోడవరం ( జనస్వరం ) :  నియోజకవర్గంలో జనసేన పార్టీ విజయమే లక్ష్యంగా, ప్రజల సమస్యలు స్వయంగా తెలుసుకొనుటకు, వాటి పరిష్కారానికి కృషి సల్పుటకు, పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆదేశంతో నియోజకవర్గ ఇంచార్జి  PVSN రాజు గారిచే పల్లె పల్లెకు జనసేన కార్యక్రమం ప్రారంభించబడింది. తొలుత చోడవరం పట్టణంలో గల స్వయంభు వినాయక గుడిలో, తదుపరి లక్కవరం గ్రామంలో గల ఈశ్వరుని ఆలయంలో పవన్ కళ్యాణ్ గారి పేరిట ప్రత్యేకపూజలు చేసి, కరపత్రిక ఆవిష్కరణ చేయుట జరిగింది. తదుపరి లక్కవరం గ్రామంలో గల పలు కుటుంబాలను రాజు గారు నేరుగా కలిసి జనసేన పార్టీకి మద్దతు పలకాల్సిందిగా అధికారం వచ్చిన తర్వాత ప్రతి ఒక్క సమస్యను పరిష్కరించే బాధ్యతను తీసుకుంటామని వారికి తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో చోడవరం అధికార ప్రతినిధి బొబ్బిలి నాయుడు, మండల పార్టీ అధ్యక్షులు గూనూరు మూలు నాయుడు, మైచర్ల నాయుడు, డి యస్ నాయుడు ,పట్టణ అధ్యక్షులు కర్రి రమేష్, నవర సరోజిని, ముఖ్య నాయకులు గూనూరు సూర్యనారాయణ గారు, రావడ గణేష్, పరవాడ దొరబాబు, కేసరపూడి శివాజీ, తుమ్మపాల రమేష్, సుంకర చరణ్, ఎడ్ల రామమూర్తి, దొండ సాయి, మంగ శ్రీనివాసరావు, దేవరపల్లి శంకర్, సన్యాసినాయుడు, బాలాజీ, దేవుడు నాయుడు, అప్పల నాయుడు, ముద్దుర్తి శంకర్, తదితరులు పాల్గొన్నారు.

See also  రామ్ చరణ్ జన్మదిన వేడుకలు సందర్భంగా మేరీ వృద్ధాశ్రమములో నిత్యావసర సరుకులు పంపిణీ