
జగ్గయ్యపేట ( జనస్వరం ) : 2022 సెప్టెంబర్ నెలలో జగ్గయ్యపేట నియోజకవర్గ జనసైనికుల ఆధ్వర్యంలో తలపెట్టిన జనసేన జండా దిమ్మె ఆవిష్కరణ కార్యక్రమాన్ని అధికార పార్టీ నాయకులు కుట్రపూరితంగా ధ్వంసం చేసిన ఘటనలో భాగంగా ప్రశ్నించిన జనసైనికుల మీద అక్రమంగా పెట్టిన కేసులో భాగంగా నేడు జగ్గయ్యపేట పట్టణంలో గల స్థానిక జూనియర్ సివిల్ కోర్టు నందు మొదటి వాయిదాకు హాజరవటం జరిగింది.
1. A1. బండ్రెడ్డి రామకృష్ణ గారు.. కృష్ణా జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు
2. A2. రావి సౌజన్య గారు.. కృష్ణా పెన్నా వీరమహిళ విభాగం అధ్యక్షురాలు
3. A3. బొలియశెట్టి శ్రీకాంత్ గారి.. కృష్ణా జిల్లా జనసేన పార్టీ ఉపాధ్యక్షులు
4. A4. బాడిస మురళీకృష్ణ గారు.. కృష్ణా జిల్లా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి
5. A5. ఈమని కిషోర్ కుమార్.. కృష్ణా జిల్లా జనసేన పార్టీ సంయుక్త కార్యదర్శి